వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో వీధికి జయలలిత పేరు, నాడు ఎందుకు పెట్టారంటే..

అమెరికాలో ఓ వీధికి జయలలిత పేరు పెట్టారు. చికాగోలోని బ్రాడ్ వే అవెన్యూ, డెవన్‌ అవెన్యూ, నార్త్‌ షెరిడాన్‌ వీధులు కలిసేచోట ఒక వీధికి డాక్టర్‌ జె జయలలిత వే అని పేరు పెట్టారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అమెరికాలో ఓ వీధికి జయలలిత పేరు పెట్టారు. చికాగోలోని బ్రాడ్ వే అవెన్యూ, డెవన్‌ అవెన్యూ, నార్త్‌ షెరిడాన్‌ వీధులు కలిసేచోట ఒక వీధికి డాక్టర్‌ జె జయలలిత వే అని పేరు పెట్టారు. వెస్ట్ డెవన్‌ అవెన్యూలో జయలలితతో పాటు మహాత్మా గాంధీ, మహ్మద్‌ అలీ జిన్నా, గోల్డామీర్‌ పేర్ల మీద కూడా వీధులున్నాయి.

జయ మృతి: పన్నీరు సెల్వం వెనుక శశికళ, అప్పుడే పట్టు కోసం పావులు?

జయలలిత నాయకత్వానికి, అట్టడుగు వర్గాల పట్ల ఆమెకున్న అంకిత భావానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని ఇస్తున్నట్లు నాటి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ ఎడ్గర్‌ ప్రకటించారు.

Chicago Street Named after Jayalalitha

ఆమెకు ఈ గుర్తింపు లభించడానికి కారణం ఇల్లినాయిస్‌ సెనేటర్‌ హోవర్డ్‌ డబ్ల్యూ కెరోల్‌. తమిళనాడును ఆదర్శంగా తీసుకుని ఇల్లినాయిస్‌లో కూడా మహిళా పోలీస్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తామని, మహిళా శిశు సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని నాడు చెప్పారు.

కాగా, జయలలితను ప్రజలు అమ్మగా పిలుస్తారు. ముఖ్యమంత్రి హోదాలో జయలలిత ఎంతో ఒత్తిడితో ఇంటికి చేరుకోగానే ఆమెకు సపరిచర్యలు చేసేది ఓ సాధారణ మహిళ. జయలలిత మృతి చెందే వరకు ఆమె పక్కనే ఉంటూ సపర్యలు చేపట్టింది. ఆమె మరణ వార్త వెల్లడించిన తర్వాత ఆ మహిళ కన్నీటితో బయటకు వచ్చింది. ఆమె చుట్టు తమిళులు గుమికూడారు.

English summary
Chicago Street Named after Jayalalitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X