వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మార్ట్‌ఫోన్ ఎంత పనిచేసింది ? చూపు కోల్పోనున్న చిన్నారి ...?

|
Google Oneindia TeluguNews

బీజింగ్ : స్మార్ట్‌ఫోన్ వచ్చాక అన్నీ పనులు తేలికయ్యాయి. ఎలా అంటే ఏ పనైనా చిటికలో పూర్తవుతుంది. మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అన్నీ పనులను ఏం చక్కా చేసిపెడుతుంది. అయితే ఫోన్‌తో చేటు కూడా ఉందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. సున్నితమైన కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. వైద్యుల ఆందోళన నిజమైంది. చైనాలో ఓ చిన్నారి చూపుపై తీవ్ర ప్రభావం చూపింది. మరికొన్నేళ్లలో ఆమె చూపు కోల్పోయే అవకాశం ఉందని చెప్పడంతో .. పేరెంట్స్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

చూపు కోల్పోనున్న చిన్నారి ..
చైనాలోని జియాంగ్యూకు చెందిన జియావో అనే రెండేళ్ల బాలికకు గత కొద్దిరోజుల నుంచి కళ్లు సరిగా కనిపించడం లేదు. దీంతో ఏం జరిగిందని డాక్టర్లకు చూపించారు. వైద్య పరీక్షలు చేసినా వైద్యులు చిన్నారికి హ్రస్యదృష్టి వచ్చినట్టు తెలిపారు. చిన్నారి ఎదిగేకొద్దీ సమస్య తీవ్రమవుతుందనే కఠోర వాస్తవాన్ని తెలిపారు. దీంతో తమ కూతురు పరిస్థితి ఏంటి అని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. చిన్నారి పెరిగేకొద్దీ సమస్య ఎక్కువవుతుందని వైద్యులు తెలిపారు.

 child to be blind .. for using smartphone

మరో ఏడేళ్లలో అంటే చిన్నారికి 9 ఏళ్లు వచ్చేసరికి ఆమె చూపు కోల్పోతుందనే నమ్మశక్యం కానీ మాటను చెప్పారు వైద్యులు. తమ పాపకు ఎందుకీ సమస్య వచ్చిందని లోతుగా పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. ఏడాది వయస్సున్నప్పటి నుంచి చిన్నారి ఫోన్‌లో గేమ్స్ ఆడేదని తెలిపారు. అలా గంటలపాటు ఫోన్ చూడటంతో కళ్లపై ప్రభావం చూపిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె చూపు కోల్పోయేందుకు కూడా కారణమైందని వివరించారు.

ఇక దూరం
చిన్నవయస్సు నుంచి ఫోన్లు వాడటంతో పిల్లలపై ప్రభావం పడుతుంది. అందుకే పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దని వైద్యులు పదే పదే సూచిస్తారు. అయినా వారికి ఫోన్లు ఇవ్వడంతో కళ్లపై ప్రభావం పడి .. జియావో మాదిరిగా కళ్లు కోల్పోయో ప్రమాదం పొంచి ఉంది. తమ పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఫోన్లు, ట్యాబ్‌లను దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే మరికొందరు చిన్నారులు కూడా చూపే కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.

English summary
A two-year-old girl named Jiao, from Jianghu, China, has not been eyeing since the last few days. The doctors were shown what had happened. Despite the medical examination, the doctors said that the child had a short sight. He said the blatant fact that the problem is getting worse as the child grows up. Parents are worried about their daughter's condition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X