వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిలీలో భూకంపం: 5గురు మృతి, పక్కదేశాలు అప్రమత్తం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

శాండియాగో: చిలీలో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.4 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం తర్వాత ఆరుసార్లు అక్కడి భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత కూడా రిక్టర్ స్కేలుపై 6 కంటే అధికంగానే నమోదైంది. భారీ భూకంపాల వల్ల ఇప్పటి వరకు ఐదుగురు మరణించగా, పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఈ భూకంపం కారణంగా ఆ దేశంలోని పలు భవనాలు పేకమేడల్లా కుప్పకూలినట్లు ప్రాథమిక సమాచారం. చిలీకి సమీపంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమవ్వడంతో పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

Chile Earthquake Massive 8. 3 Magnitude Tremor Strikes Santiago

రాజధాని శాండియాగోకు 232 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీంతో భారీ తీవ్రతతో కూడిన భూకంపం నేపథ్యంలో వాల్ పరైసో, పెరూ, హవలీ తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

సునామీతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే 3 మీటర్ల కన్నా ఎత్తైన అలలతో కూడిన సునామీ చీలీ తీర ప్రాంతాన్నితాకే తాకినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

న్యూజిలాండ్ లోనూ సునామీ హెచ్చరికలు

చిలీలో భారీ భూకంపం సంభవించిన తర్వాత దాని చుట్టుపక్కల దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే న్యూజిలాండ్ లో ఉన్న సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో న్యూజిలాండ్‌లో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత వాసులు తమ నివాసాలను వదిలి దూరంగా వెళ్లాలని, వారిని సురక్షిత ప్రాంతాల తరలింపు చర్యలకు దిగాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది.

English summary
The undersecretary for the ministry of the interior and public security says five people have killed and one million people across Chile have been evacuated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X