వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతిపెద్ద కార్చిచ్చు దెబ్బకు.. పట్టణాలకు పట్టణాలు ఠా

ఇప్పటికే కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తాజాగా సంభవించిన కార్చిచ్చు చిలీ ప్రాంత ప్రజానీకాన్ని వణికిస్తోంది. పెనుగాలులు తోడవడంతో దావానలంలా మారి పట్టణాలకు పట్టణాలను బొగ్గు బొగ్గు చేసేస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చిలీ: ఆధునిక చరిత్రలోనే ఇదో అతిపెద్ద కార్చిచ్చు. అనూహ్యంగా రేగిన ఈ కార్చిచ్చు ఎంతకీ అదుపులోకి రాకపోగా.. విసురుగా వీస్తున్న పెనుగాలులు తోడవడంతో దావానలంలా మారి పట్టణాలకు పట్టణాలను బొగ్గు బొగ్గు చేసేస్తోంది.

ఈ కార్చిచ్చు దెబ్బకు మధ్య చిలీ ప్రాంతాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. ఆ ప్రాంత ప్రజానీకం బెంబేలెత్తిపోతోంది. ఇన్నాళ్ళూ వారు నివశించిన ఆ ప్రాంతాలను ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోతున్నారు.

Chile's worst wildfire destroys town as help arrives

శాంటా ఓల్గా పట్టణంలో వందలు వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలు తప్ప వారి వద్ద ఏం లేకుండా పోయాయి. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. విపరీతంగా వస్తున్న వేడి గాలులు, చుట్టేసిన నల్లటి పొగ కారణంగా సమీప ప్రాంతాల్లో కూడా ప్రజలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో రష్యా కూడా రంగంలోకి దిగింది. టన్నుల కొద్దీ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగిన సూపర్ ట్యాంకర్ విమానాన్ని పంపించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తాజాగా సంభవించిన కార్చిచ్చు చిలీ ప్రాంత ప్రజానీకాన్ని వణికిస్తోంది.

English summary
Russia has sent a super-tanker aircraft capable of carrying tons of water to douse the fires.The series of fast-spreading fires, mostly in Chile's central region, are being fanned by strong winds, high temperatures and a prolonged drought. One town, Santa Olga, has been destroyed by the blaze.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X