వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ గడువు: భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా చైనా అడ్డుపుల్ల

జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మరోసారి చైనా మోకాలాడ్డింది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మరోసారి చైనా మోకాలాడ్డింది.

భారత్‌ను బెదిరించి లొంగదీయలేం, ఆ యుద్ధంతో మనకే నష్టం: చైనా నిపుణుల హెచ్చరిక భారత్‌ను బెదిరించి లొంగదీయలేం, ఆ యుద్ధంతో మనకే నష్టం: చైనా నిపుణుల హెచ్చరిక

15 దేశాల్లో 14 ఓకే చెప్పాయి, చైనా మాత్రం

15 దేశాల్లో 14 ఓకే చెప్పాయి, చైనా మాత్రం

మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గత సంవత్సరం మార్చిలో భారత్ చేసిన విజ్ఞప్తికి 15 దేశాల ఐక్య రాజ్య సమితి కమిటీలో 14 దేశాలు అంగీకరించాయి.

సాంకేతిక కారణాలతో అడ్డుపుల్ల

సాంకేతిక కారణాలతో అడ్డుపుల్ల

చైనా మాత్రం సాంకేతిక కారణాలు చూపిస్తూ అడ్డుకుంటోంది. ఆగస్టు 2వ తేదీన చైనా తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆదేశాలు వచ్చాయి. ఆ తేదీ ముగియడానికి గంటల ముందే తమకు మరో మూడు నెలల సమయం కావాలని చైనా కోరింది.

మరింత రెచ్చగొట్టేలా చైనా తీరు

మరింత రెచ్చగొట్టేలా చైనా తీరు

ఇప్పటికే భారత్‌-చైనా మధ్య డోక్లాం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత చైనా తీరు ఇరుదేశాల మధ్య విభేదాలను మరింత రెచ్చగొట్టే విధంగా ఉంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనంగా మారుతాయంటున్నారు. మసూద్ పైన ఇప్పటికే చైనా రెండుసార్లు గడువు కోరింది.

అమెరికా ముందుకొచ్చినా

అమెరికా ముందుకొచ్చినా

ఈలోగా గడవు పూర్తవడంతో భారత్‌ దరఖాస్తు చెల్లకుండా పోయింది. దీంతో ఈసారి అమెరికా ముందుకొచ్చింది. ఐరాసలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా ప్రతిపాదన చేసింది. చైనా మళ్లీ అభ్యంతరం తెలిపింది. ఆరు నెలల పాటు గడువు కోరింది. ఆగస్టు 2తో ఆ గడువు పూర్తవడంతో మరోసారి మూడు నెలలపాటు వాయిదా కోరింది.

English summary
China has again extended by three months its technical hold on the US, France and UK- backed proposal to list JeM chief and Pathankot terror attack mastermind Masood Azhar as a designated terrorist by the UN.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X