వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus:అమెరికా సహకారం తీసుకోనున్న చైనా...425కు చేరిన కరోనా వైరస్ మృతుల సంఖ్య

|
Google Oneindia TeluguNews

చైనా: చైనా నగరాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. అక్కడి ప్రజలు క్షణక్షణం భయంతో బతుకుతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారీ బారిన పడి 425 మంది మృతి చెందారు. అంతకుముందు రోజుకంటే సోమవారం నాటికి 65 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వం పేర్కొంది. మరణించిన వారంతా సెంట్రల్ హూబే ప్రావిన్స్‌కు చెందిన వారు కావడం విశేషం.

కరోనా వైరస్‌పై పోరు: మహమ్మారిని పారదోలేందుకు 173 బిలియన్ డాలర్లు కేటాయించిన చైనా కరోనా వైరస్‌పై పోరు: మహమ్మారిని పారదోలేందుకు 173 బిలియన్ డాలర్లు కేటాయించిన చైనా

అమెరికా సహకారం తీసుకోనున్న చైనా

అమెరికా సహకారం తీసుకోనున్న చైనా


కరోనా వైరస్‌ను ఎదుర్కొని దేశం నుంచి పారద్రోలేందుకు చైనా ప్రభుత్వం అన్ని రకాల మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగా మొన్నటి వరకు అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య యుద్ధం చేసిన చైనా... ఈ కష్ట సమయంలో ఆదేశ సహకారాన్ని కోరింది. కరోనావైరస్ పోరుకు తమ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించడంతో.. అగ్రరాజ్యం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చైనా కోరింది. ఇప్పటికే కరోనావైరస్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదిలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా జరుగుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా అలాంటి ప్రకటనలు చేయడం మానుకోవాలి

అమెరికా అలాంటి ప్రకటనలు చేయడం మానుకోవాలి

కరోనా వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయిన వారి సంఖ్య 20438కి చేరుకుంది. మరోవైపు ఇతర దేశాల్లో 151 కేసులు నమోదైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ పై అమెరికా చేసిన ఆందోళనకరమైప ప్రకటన వల్లే చైనా స్టాక్ మార్కెట్లు 8శాతం మేరా పతనమయ్యాయని చైనా ఆరోపణలు చేసింది. గత రెండువారాలుగా చైనాకు వెళ్లిన వారిని తమదేశంలోకి రాకుండా నియంత్రిస్తున్నామన్న అమెరికా ప్రకటనను చైనా తప్పుపట్టింది. ఇలాంటి కష్ట సమయంలో అమెరికా కక్షపూరితంగా కాకుండా మంచిగా ప్రవర్తించాలని లేనిపోని ఆందోళనలు సృష్టించడం మంచిది కాదన్నారు చైనా విదేశాంగశాఖ మంత్రి.

కరోనాతో ప్రపంచ ఆర్థిక అవుట్‌పుట్ క్షీణించే అవకాశం

కరోనాతో ప్రపంచ ఆర్థిక అవుట్‌పుట్ క్షీణించే అవకాశం

ఇప్పటికే వూహాన్ నగరంతో పాటు ఇతర నగరాలను పూర్తిగా మూసివేసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా చైనా ఒంటరి దేశంగా మిగిలిపోయింది. ఈ సమయంలో ఆర్థికంగా కూడా చైనా బలహీనపడుతోంది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు చైనాకు తమ విమానాల సర్వీసులను రద్దు చేశాయి. ఇక కరోనా వైరస్‌తో చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఔట్‌పుట్ 0.2 నుంచి 0.3 శాతం పాయింట్లకు క్షీణిస్తుందని అంచనావేస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఇదిలా ఉంటే ఆయా దేశాలు చైనాలో ఇరుక్కున్న తమ దేశస్తుల కోసం ప్రత్యేక విమానాలను పంపి వెనక్కు తీసుకొస్తున్నాయి.

తమ పౌరులను వెనక్కు రప్పించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాలు

తమ పౌరులను వెనక్కు రప్పించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాలు


సోమవారం రోజున ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ ప్రత్యేక విమానంను వూహాన్ నగరంకు పంపి ఆ దేశంకు చెందిన వారిని వెనక్కు రప్పించింది. గతవారమే అమెరికా కూడా తమ విమానాలను పంపి తమ పౌరులను వెనక్కు తీసుకొచ్చింది. మరి కొన్ని విమానాలను పంపి మిగతావారిని కూడా అమెరికాకు తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తోంది ట్రంప్ సర్కార్. కరోనావైరస్‌పై పోరుకు తమ సహకారం తీసుకునేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ మిషన్‌లో ఉండే వైద్యులలో అమెరికా వైద్యులు కూడా ఉంటారని తెలిపింది.

English summary
The toll in China rose to 425 as of the end of Monday, up by a record 64 from the previous day, the National Health Commission said on Tuesday. All of the new deaths were in central Hubei province, the epicentre of the virus outbreak
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X