వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణాచల్ మీది అని గుర్తించం, కలిసి పని చేద్దాం: భారత్‌కు చైనా

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా శాంతిమంత్రం పఠిస్తోంది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కలిసి పని చేయాలని బీజింగ్ సోమవారం తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ ప్రతినిధి జెంగ్ షువాంగ్ సూచన చేశారు.

సరిహద్దు వివాదంపై భారత్ ఆందోళన చేయకుండా అక్కడ శాంతిని నెలకొల్పేందుకు తమతో కలిసి పని చేయాలన్నారు. భారత దళాలు అరుణాచల్ ప్రదేశ్‌లో పెట్రోలింగ్ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనా, భారత్ మధ్య ప్రస్తుత పరిస్థితి తనకు తెలియదని, రెండు దేశాల సరిహద్దు గురించి చైనా చాలా స్పష్టంగా ఉందని, అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో భాగంగా చైనా ఎప్పటికీ గుర్తించదన్నారు.

China asks India to refrain from hyping up border issue

సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి చైనా, భారత్ ఇప్పటికే చర్చల్లో నిమగ్నమయ్యాయని, రెండింటికీ అంగీకారమయ్యే ఒప్పందాన్ని సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

ఇదిలా ఉండగా, భారత్ సరిహద్దుల్లో చైనా నిఘా పెంచింది. ఇందుకోసం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్‌లోని లడక్, టిబెట్ ఆటోనామస్ రీజియన్ (ఏటీఆర్) మధ్య పాంగాంగ్ సరస్సు వద్ద సరికొత్త పెట్రోలింగ్ పడవలను తీసుకు వచ్చింది.

ఈ బోట్లు నాన్‌ మెటాలిక్‌ పదార్థాలతో తయారు చేయబడ్డాయి. గంటకు 40 కి.మీ. వేగంతో అవి గస్తీ కాస్తూ మంచు దిబ్బలను కూడా తట్టుకోవగలవు. పెట్రోలింగ్‌ బోట్‌లతో పాటు ఓ నిఘా కెమెరా నెట్‌వర్క్‌ను తయారుచేసి సరిహద్దు బలగాలు వెళ్లలేని ప్రాంతాల్లో దానిని వినియోగిస్తోంది. దానితో పాటు శాటిలైట్‌ ఎర్లీ వార్నింగ్‌ మానిటరీ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ విషయాలను చైనా మీడియా ఓ కథనంలో పేర్కొంది.

English summary
China today asked India to respect the Line of Actual Control and refrain from "hyping up" the boundary issue and work with it to jointly maintain peace and tranquillity in the border areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X