వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది అంతకన్నా డేంజర్.. ఉ.కొరియా హైడ్రోజన్ బాంబు; చైనా సంచలన నిర్ణయంతో కిమ్‌కు షాక్

ఐక్యరాజ్యసమితి అంక్షలను చైనా తప్పకుండా పాటిస్తుందని సెంట్రల్ బ్యాంకు స్పష్టం చేసింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

China's central bank move against North Korea ఉ.కొరియా హైడ్రోజన్ బాంబు; కిమ్‌కు చైనా షాక్| Oneindia

వాషింగ్టన్/బీజింగ్: రెండు దేశాల మధ్య మాటల యుద్దం ప్రపంచాన్ని తల పట్టుకునేలా చేస్తోంది. రెండింటిలో ఏ దేశం సహనం కోల్పోయినా.. మరో మారణహోమం తప్పదు కాబట్టి, దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

అయితే సంధి దిశగా కంటే యుద్దం దిశగానే అమెరికా-ఉత్తరకొరియాలు కదులుతుండటంతో.. ఏ క్షణం ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు దేశాల్లో ఏ దేశం యుద్దాన్ని మొదలుపెట్టినా.. అది మూడో ప్రపంచ యుద్దానికి దారి తీయడం మాత్రం ఖాయం.

ట్రంప్-కిమ్ ఇద్దరూ ఎల్‌కెజి పిల్లల్లా?: ఉ.కొరియాకు చైనా ఊహించని దెబ్బ..ట్రంప్-కిమ్ ఇద్దరూ ఎల్‌కెజి పిల్లల్లా?: ఉ.కొరియాకు చైనా ఊహించని దెబ్బ..

అమెరికా కన్నా పెద్ద బాంబు:

అమెరికా కన్నా పెద్ద బాంబు:

తొలి నుంచి ఉత్తరకొరియా సామర్థ్యంపై నమ్మకం లేని అమెరికా.. ఇప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ది మేకపోతు గాంభీర్యమే అని భావిస్తోంది. అయితే అమెరికన్ ఇంటలిజెన్స్ మాత్రం కిమ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదని హెచ్చరిస్తోంది.

అంతేకాదు!, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా ప్రయోగించిన అణు బాంబుల కంటే చాలా పెద్ద హైడ్రోజన్ బాంబును ఉత్తరకొరియా పరీక్షించి చూసిందని తెలిపింది.

'సీక్రెట్'గా ఆ పనిలో ఉ.కొరియా: అమెరికాకు వణుకు.. యుద్దం ముంచుకొస్తుందా?'సీక్రెట్'గా ఆ పనిలో ఉ.కొరియా: అమెరికాకు వణుకు.. యుద్దం ముంచుకొస్తుందా?

జాగ్రత్త పడాల్సిందే: అమెరికన్ ఇంటలిజెన్స్

జాగ్రత్త పడాల్సిందే: అమెరికన్ ఇంటలిజెన్స్

ఉత్తరకొరియాను తక్కువ అంచనా వేస్తే.. ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని అమెరికన్ ఇంటలిజెన్స్ అభిప్రాయపడింది. అమెరికా ప్రధాన నగరాలను ధ్వంసం చేసేలా క్షిపణులు తయారు చేస్తామని ఉత్తరకొరియా హెచ్చరించిన తీరును విస్మరించరాదని పేర్కొంది. హైడ్రోజన్ బాంబు ప్రయోగం జరగలేదని అమెరికా భావిస్తున్నప్పటికీ.. దీన్ని కొట్టిపారేయడానికి లేదని, ప్రయోగం జరిగే ఉంటుందని ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఆ దేశంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఎట్టకేలకు చైనా:

ఎట్టకేలకు చైనా:

నిన్న మొన్నటిదాకా ఉత్తరకొరియాను వెనకేసుకొచ్చిన చైనాకు.. క్షిపణులు తమవైపు దూసుకొస్తే గానీ ప్రమాద ముప్పు కనిపించలేదు. ఎట్టకేలకు ఉత్తరకొరియా స్వభావాన్ని గుర్తెరిగిన చైనా.. ఐక్యరాజ్య సమితి ఆంక్షలకు తలొగ్గింది.

ఉత్తరకొరియా ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి చైనా సహకారం తప్పనిసరి కావడంతో.. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాల్సిందిగా డ్రాగన్ కంట్రీకి ఐరాస ఆంక్షలు విధించింది. ఈ విషయంలో తొలుత మొండిగా వాదించినా.. వాస్తవాన్ని గ్రహించిన తర్వాత చైనా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఉత్తరకొరియాతో సంబంధాలను తెంచుకునే దిశగానే అడుగులు వేస్తోంది.

చైనా సంచలన నిర్ణయం:

చైనా సంచలన నిర్ణయం:

ఉత్తరకొరియాతో ఆర్థిక లావాదేవీలను నిలిపేయాలని చైనా సెంట్రల్ బ్యాంకు సంచలన ప్రకటన చేసింది. చైనాలోనే అతిపెద్ద బ్యాంకుగా పేరొందిన చైనా సెంట్రల్ బ్యాంకు ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన బ్యాంకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి అంక్షలను చైనా తప్పకుండా పాటిస్తుందని సెంట్రల్ బ్యాంకు స్పష్టం చేసింది. చైనా బ్యాంకు తీసుకున్న నిర్ణయం కిమ్ జాంగ్ కు గట్టి షాకే అని తెలుస్తోంది.

English summary
China's central bank has told banks to strictly implement United Nations sanctions against North Korea, four sources have told Reuters, amid US concerns that Beijing has not been tough enough over Pyongyang's repeated nuclear tests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X