వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాపారాలు మా కొద్దు, మా ఇష్టం వచ్చిన రంగంలోనే స్థిరపడుతాం

చైనాలో వ్యాపారవేత్తలు వారసుల కోసం అన్వేషిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయాల వ్యాపారాల కోసం తండ్రులు తమ కొడుకులకు అప్పగించాలని ప్రయత్నిస్తే, వ్యాపార రంగంలో స్థిరపడేందుకు కొడుకులు ఆసక్తిని చూపడం లేదు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చైనా : తల్లిదండ్రులు ఏ రంగంలో కొనసాగుతున్నారో వారి వారసులు కూడ సాధారణంగా అదే రంగంలో కొనసాగేందుకు ఆసక్తిని చూపుతారు. కొందు మాత్రం తల్లిదండ్రులు కొనసాగిన రంగాలను వదిలి తమకు ఇష్టమైన రంగాల్లోకి వెళ్తుంటారు. అయితే చైనాలో వ్యాపారవేత్తలకు కొత్త కస్టాలు వచ్చాయి,. లక్షల కోట్ల రూపాయాల వ్యాపారాలను చూసేందుకు వ్యాపారస్తుల పుత్రరత్నాలు మాత్రం ఆసక్తిని చూపడం లేదు. తమకు నచ్చిన రంగంలో కొనసాగుతామని తేల్చి చెబుతున్నారు. ఈ పరిస్థితులతో ఈ వ్యాపారాలను చూసుకొనేందుకు వారు అర్హులకోసం వెతుక్కొనే పరిస్థితి నెలకొంది.

బొమ్మరిల్లు సినిమా కష్టాలు

తెలుగుతో బొమ్మరిల్లు సినిమా గుర్తుండే ఉంటుంది. తండ్రి అన్నీ తనకు నచ్చినట్టుగానే కొడుకు కోసం చేస్తాడు. ఆఖరుకు పెళ్ళి విషయంలో కూడ ఇదే పద్దతులను అనుసరిస్తాడు. తమకు నచ్చినట్టుగా బతకాలని కొడుకులు భావిస్తున్నారనే అంశాన్ని ఎంచుకొని తీసిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా తరహలోనే చైనాలో పుత్రరత్నాలతో తల్లిదండ్రులకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. తమ కోట్లాది రూపాయాల ఆస్తులను సంరక్షించే వారిని వెతుక్కోవాల్సిన పరిస్థితులు చైనీయులకు ఏర్పడ్డాయి. తమ అభిరుచికి తగ్గ రంగాల్లో తాము స్థిరపడుతామని వ్యాపారస్థుల కొడుకులు చెబుతున్నారు.దీంతో చైనా వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు.

china business men facing problem we dont like business

లక్షల కోట్ల వ్యాపారం వదులుకొంటున్నాడు

చైనాలో ప్రముఖ వ్యాపారవేత్త వాంగ్ జియాన్ లిన్ . ఈయనకు 6.2 లక్షల కోట్ల విలువైన వ్యాపారాలు ఉన్నాయి. 1988లో డాలియన్ నగరంలో రియల్ ఏస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఆయన ఎదిగాడు. చైనాలో అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకడుగా నిలిచాడు. షాపింగ్ మాల్స్, థీమ్ పార్క్ లు, స్పోర్ట్స్ క్లబ్ లు, సినిమాథియేటర్ల నిర్మాణంలో ఆయన వ్యాపారాన్ని విస్తరించుకొన్నారు.వ్యాపారంలో ఆయనకు ఎవరూ నిలువలేకపోయారు. కుటుంబంతోనే ఆయన ప్రస్తుతం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.వయస్సు మీద పడుతోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడేందుకు కొడుకును రంగంలోకి దింపాలని ఆయన భావించాడు అయితే కొడుకు మాత్రం ఈ వ్యాపారాలను చూసుకొనేందుకు అంగీకరించలేదు. ఈ వ్యాపారాలను సంరక్షించే పరిస్థితుల్లో తాను లేనని చెప్పాడు కొడుకు వాంగ్ సికాంగ్.. తనకు నచ్చిన రంగంలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించాడు. దీంతో తన వ్యాపారాన్ని కాపాడేందుకు అర్హులైన వ్యక్తి కోసం ఆయన అన్వేషిస్తున్నాడు.

మెజారిటీ కొడుకులది ఇదే నిర్ణయం

చైనాలో వ్యాపారాలు నిర్వహించే తండ్రులు తమ వ్యాపారాలను కొడుకులకు అప్పగించాలని భావిస్తున్నారు. అయితే ఈ వ్యాపారాలను చూసుకొనేందుకు మాత్రం కొడుకులు ఇష్టాన్ని చూపడంలేదు.చైనాలోని 80 శాతం వ్యాపారస్తుల పుత్రరత్నాల నుండి ఇదే రకమైన సమాధానాలు వస్తున్నాయని జియోవోతాంగ్ యూనివర్శిటీ పరిశోధనల్లో తేలింది. తమ ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలని వారసలుు చెబుతోంటే, తమ అభిప్రాయాలను వారిపై రుద్దడం తమకు ఇష్టం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.

English summary
wang jiyan lie famous business man in china ,his turnover around 6.2 lakhs crores every year.he decide to give business responsibilities his son wang sikang. sikang refused his proposal,what is he like , he do that only said, so wang jiyan searching for business responsibities. entire 80 percentage of china business people facing this problem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X