వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీరు మారని డ్రాగన్: హోటాన్ ఎయిర్‌బేస్ వద్ద రెండు ఎయిర్‌స్ట్రిప్ నిర్మాణం..

|
Google Oneindia TeluguNews

డ్రాగన్ చైనా తీరు మారడం లేదు. ఓ వైపు చర్చలు జరుపుతూనే.. మరోవైపు సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది. మాస్కోలో చైనా మంత్రి వి పెంగీ.. రాజ్‌నాథ్‌తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే తూర్పు లడాఖ్ సరిహద్దుల్లో మాత్రం తన వైఖరిని కొనసాగిస్తూ వస్తోంది. మరోవైపు లడాఖ్ సమీపంలో గల హోటాన్ ఎయిర్ బోస్ వద్ద రెండు కొత్త ఎయిర్ స్ట్రిప్ నిర్మిస్తోన్నట్టు ఉపగ్రహ ఛాయాచిత్రాలు చూపిస్తున్నాయి. ఇదీ తూర్పు లడాఖ్‌కు దగ్గరగా ఉండటంతో చైనా కుయుక్తి అర్థమవుతోంది. ఇక్కడ నిర్మాణ పనులు ఉద్రిక్త నెలకొన్న జూన్ చివరి వారంలో ప్రారంభమయ్యాయి.

Recommended Video

India-China Stand Off : సరిహద్దుల్లో China చర్యలు.. రెండు కొత్త ఎయిర్ స్ట్రిప్ ల నిర్మాణం!
 China constructs two new airstrips at Hotan airbase..

ఇక్కడ కొన్ని మందుగుండు నిల్వ ఉంచే భవనాలు.. ఫైటర్ జెట్లు మొహరించే భవన సముదాయం.. పీఎల్ఏ రాకెట్ ఫోర్స్, చైనా న్యూక్లియర్ కన్వెన్షన్ మిసైల్ అప్ గ్రేడేషన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇక్కడ ఫైటర్ జెట్లను మొహరించాయని ఓ ప్రతిక జూలై నెలలో రిపోర్ట్ చేసింది. హోటాన్ ఎయిర్ బేస్ 3330 మీటర్ల పొడవు రన్ వే, వెడల్లు మాత్రం 60 మీటర్లు ఉంటుంది. మరో రెండు రన్ వేలు 4 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఉంటాయని శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. అయితే ఇది టెర్మినల్ భవనం పేరుతో నిర్మిస్తోన్న విమానాశ్రయం కావచ్చు అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ ఫైటర్ బాంబర్లు, విమానాలను మొహరించాలని అనుకుంటే ఎయిర్ బేస్‌కు మందుగుండు సామాగ్రి కచ్చితంగా అవసరం అవుతోంది. భవనాలకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ జాబితాలో క్షిపణులను నిల్వ చేయడానికి పర్యావరణ నియంత్రణ వ్యవస్థ మద్దతు అవసరం ఉంటుంది. ఎయిర్ బేస్ తూర్పున కనీసం 27 మందు గుండు భవనాలు నిర్మించాల్సి ఉంటుంది.

English summary
China is revamping its military logistic facilities since the standoff with India began in Ladakh in June.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X