Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చైనా విమాన ప్రమాదానికి కారణం అదే.. అధిక పీడనంతో కూలి ఉంటుందని అంచనా..?

చైనా విమాన ప్రమాద మిస్టరీకి సాక్ష్యం దొరికింది. ప్రమాదం ఎలా జరిగిందో ఉన్నత అధికారులు వివరించారు. విమానం గాల్లో అధిక పీడనంతో పేలిపోయి నేలకూలి ఉంటుందని చెబుతున్నారు. విమానం కూలిపోయిన ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరంలో ఓ శకలాన్ని వారు గుర్తించారు. అయితే అదీ ఎలాంటి శకలం.. ఎప్పుడు బయటపడిందనే అంశంపై మాత్రం స్పష్టత లేదని మాజీ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ జెఫ్ గుజ్జెటి తెలిపారు. అయితే విమానం ఎలాంటి రేడియో సందేశం ఇవ్వకుండానే నిర్దేశిత లక్ష్యానికి 100 మైళ్ల దూరంలో పడిపోయింది. ఈ మేరకు చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసింది. విమానం ప్రయాణిస్తోన్న సమయంలో అందులో 132 మంది ప్రయాణికులు ఉన్నారు.

విమాన శకలం వ్యవసాయ భూమిలో కనిపించిందని గ్యాంగ్జీ అగ్నిమాపక రెస్క్యూ టీమ్ అధిపతి జెంగ్ జి తెలిపారు. విమానం ముందు భాగం విరిగిపోవడానికి కారణం.. హై స్పీడ్.. లేదంటే ఒత్తిడి వల్ల అనే విషయం దర్యాప్తులో తేలనుంది. నిమిషం 35 సెకన్లలో విమానం 29 వేల అడుగల ఎత్తు నుంచి కుప్పకూలిపోయిందని.. కిందకి పడే సమయంలో విడి భాగాలు పడిపోయి ఉంటాయని గుజ్జెట్టి తెలియజేశారు.

China Crash Mystery Deepens As Evidence Suggests Mid-Air Breakup

విమానం 3225 అడుగులకు చేరుకునే వరకు బానే ఉంది. ఆ తర్వాత ప్రమాదం జరిగి ఉంటుంది. సాధారణ వేగం కంటే ఎక్కువ ఎగిరినట్టు కనిపించింది. అలా వేగంగా వెళ్లడంతో.. రెక్కలు, తోక భాగాలు విరిగిపోతాయని ఇండోనేషియా సిల్క్ ఎయిర్ 737-300 ప్రమాదంపై జరిగిన పరిశోధన ద్వారా తెలిసింది. ఈ సారి కూడా అలానే జరిగి ఉంటుంది.

ప్రమాదం తర్వాత అందులో ప్రయాణిస్తోన్న మృతదేహాలేవీ లభ్యం కాలేదు. విమాన ప్రమాద మృతులపై అధికారిక ప్రకటన రాలేదు. విమానం కూలిపోయి, దగ్ధమైన తీరు చూస్తుంటే ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండే అవకాశాల్లేవని తెలుస్తోంది. చైనాలో ఇటీవల 132 మందితో వెళుతున్న బోయింగ్ విమానం ఓ పర్వత ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. విమాన ప్రమాద ఘటన ఓ మిస్టరీగా మారింది.

Recommended Video

    China Crazy Things | Chilli Pepper Festival | Street Food | Vampire Teeth | Oneindia Telugu

    విమాన ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు కాక్ పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లయిట్ డేటా రికార్డర్ కీలకం. ఈ బ్లాక్ బాక్స్ లను విశ్లేషిస్తే విమాన ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కాక్ పిట్ వాయిస్ రికార్డర్‌ను కనుగొన్న సహాయక బృందాలు, తాజాగా ఫ్లయిట్ డేటా రికార్డర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాయి. వాటిని పరిశోధిస్తే కీలక విషయాలు తెలిశాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+