వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైడెన్‌ గెలుపును అంగీకరించని చైనా, రష్యా- తుది ఫలితాల తర్వాతే స్పందిస్తామని వెల్లడి...

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డె్మోక్రాట్‌ అభ్యర్ధి జో బైడెన్‌ విజయం ఖాయమని యూఎస్‌ మీడియా కోడై కూస్తున్నా దాన్ని విదేశాలు మాత్రం ఇంకా అంగీకరించే పరిస్దితిలో లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రిపబ్లికన్‌ అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ శత్రువు చైనాతో పాటు రష్యా కూడా తుది ఫలితాలు రానివ్వండి అంటోంది. దీంతో ఇప్పటికీ బైడెన్‌ విజయం ఇంకా ఖరారు కానట్లే కనిపిస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాంటి అవినీతి లేదు, కలిసి పనిచేద్దాం: జార్జ్ డబ్ల్యూ బుష్అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాంటి అవినీతి లేదు, కలిసి పనిచేద్దాం: జార్జ్ డబ్ల్యూ బుష్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్‌ అభ్యర్ధి జో బైడెన్‌, ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్‌ విజయంపై పలు దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. భారత్‌ వంటి దేశాల్లో పలువురు జో బైడెన్‌తో పాటు కమలకు కూడా శుభాకాంక్షలు చెబుతుండగా.. చైనా, రష్యా వంటి కమ్యూనిస్టు దేశాలు మాత్రం దీన్ని అంగీకరించేందుకు తటపటాయిస్తున్నాయి. తుది ఫలితాలు ఇంకా రానందున అప్పుడే బైడెన్‌కు శుభాకాంక్షలు చెప్పబోమని చైనా ప్రకటించింది. రష్యా కూడా తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

China declines to acknowledge Joe Bidens victory, Russia to wait for the official results

రష్యా ఎన్నికల సంఘం ఛీఫ్‌ కూడా అమెరికా ఎన్నికల ఫలితాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భారీగా మెయిల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లు పోలయినందున అక్రమాలు జరిగే అవకాశాన్ని తోచిపుచ్చలేమన్నారు. తద్వారా రిపబ్లికన్‌ అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్ చేస్తున్న ఆరోపణలను పరోక్షంగా సమర్ధించారు. దీంతో రష్యాకు కూడా ఈ వ్యవహారంలో అనుమానాలు ఉన్నట్లు స్పష్టమైంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ విజయం ఉత్తరకొరియాతో ఆ దేశ సంబంధాల్లో మార్పు తెచ్చేలా కనిపిస్తోంది. ట్రంప్‌ ఉత్తరకొరియా అధినేత కిమ్‌ను ప్రియమైన స్నేహితుడిగా అభివర్ణిస్తే ఎన్నికల ప్రచారంలో బైడెన్‌ మాత్రం కిమ్‌ను బందిపోటుగా అభివర్ణించారు.

English summary
China declined Monday to congratulate Joe Biden as the winner of the US presidential election, saying the outcome of the vote was still to be determined. Russia on Monday said it would wait for the official results of the US presidential election before commenting on its outcome
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X