వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా-చైనా: మాస్కోలో రాజ్‌నాథ్ సింగ్, భేటీ కావాలని డ్రాగన్ మంత్రి వినతి..

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా సరిహద్దు తూర్పు లడాఖ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బలగాల మొహరింపు హై టెన్షన్ సిచుయేషన్ ఏర్పడింది. అయితే మాస్కోలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. చైనా రక్షణశాఖ మంత్రి వీ ఫెంగ్ కూడా హాజరయ్యారు. గురువారం రోజున రష్యా రక్షణశాఖ మంత్రి జనరల్ సెర్గీ షోయ్గుతో రాజ్ నాథ్ సమావేశమయ్యారు. దీంతో వీ ఫెంగ్ ఉలిక్కిపడ్డారు.

Recommended Video

Chinese Defence Minister Seeks Rajnath Meet,రష్యా తో రాజ్‌నాథ్ చర్చలు || Oneindia Telugu
China defence minister requests meeting with Rajnath Singh..

ఆయనతో ఏం అంశాలు డిస్కష్ చేశారో.. సరిహద్దు పరిస్థితుల గురించి లోలోన భయపడుతూనే ఉన్నారు. దీంతో శుక్రవారం సమావేశమవుదామని రాజ్ నాథ్‌ని కోరారు. నౌకాదళం, రష్యా ప్రత్యర్థి మలక్కా జలసంధి నుంచి నిర్వహించే ఇంద్ర నావికాదళ విన్యాసాలు హిందూ మహాసముద్రంలో నిర్వహిస్తామని రాజ్ నాథ్ సంకేతాలను ఇచ్చారు. సమావేశంలో ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రతా సవాళ్లు, ఇండియా చైనా రష్యా, కిర్గిగిస్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు సహకారంపై చర్చిస్తున్నాయి.

గాల్వాన్ వ్యాలీలో చైనాతో భారత్ ఘర్షణ తర్వాత రెండోసారి మాస్కోకు రాజ్ నాథ్ సింగ్ వెళ్లారు. జూన్‌లో జరిగిన ఘర్షణతో 20 మంది భారత సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. చైనా నుంచి సైనికులు చనిపోయిన ఆ దేశం ధృవీకరించలేదు. కానీ గతనెల 29, 30, 31వ తేదీల్లో మరోసారి చొచ్చుకొచ్చేందుకు చైనా ప్రయత్నించింది. అయితే భారత భద్రతా దళాలు వారిని విజయవంతంగా అడ్డుకున్నాయి. దీంతో ఎస్ సీ వో భేటీలో రాజ్ నాథ్ పాల్గొనగా.. సమావేశం అవుదామని ఫెంగ్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంద.

English summary
Wei Fenghe, the Chinese Minister of National Defence has requested a meeting with Defence Minister Rajnath Singh on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X