• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డ్రాగన్ కంట్రీ మరో ‘డర్టీప్లాన్’! భారత సరిహద్దులో ‘స్కై ఉల్ఫ్‌ కమాండోస్‌’, క్యూటీఎస్-11 వ్యవస్థ!?

By Ramesh Babu
|

బీజింగ్: డోక్లామ్ వివాదం నుంచి కూడా చైనా పాఠం నేర్చుకోలేదు. ఆ దేశం ఇప్పటికీ తన కుయుక్తులు మానడం లేదు. అవకాశం లభించినప్పుడల్లా భారత్‌ను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టార్గెట్ చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు మనదేశంపై పైచేయి సాధించాలనే ప్రయత్నిస్తోంది.

సరిహద్దులో భారీగా చైనా యుద్ధ విమానాలు.. మళ్లీ ఏం జరగబోతోంది!?

తాజాగా భారత్ సరిహద్దులో వెస్ట్రన్ థియేటర్ కమాండోస్‌తో కూడిన ప్రత్యేక సైనిక బలగాలను మోహరించడమేకాక యుద్ధవిమానాలను అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా అమెరికా తరహాలో ఆధునిక సాంకేతికతతో కూడిన 'క్యూటీఎస్-11' వ్యవస్థను వారికి అందించింది.

భారత్, పాక్, మధ్య.. అణుయుద్ధం జరుగుతుందా? పశ్చిమ దేశాల్లో టెన్షన్!?

సైన్యంలో ‘ఇన్ఫర్మేటైజ్‌డ్‌ వార్‌ఫేర్‌'...

సైన్యంలో ‘ఇన్ఫర్మేటైజ్‌డ్‌ వార్‌ఫేర్‌'...

చైనా కూడా తన సైన్యానికి అత్యంత అధునాతన సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘సమగ్ర వ్యక్తిగత సైనిక పోరాట వ్యవస్థ'గా పిలిచే భవిష్యత్తు ‘ఇన్ఫర్మేటైజ్‌డ్‌ వార్‌ఫేర్‌'ను తన సైన్యంలో ప్రవేశపెట్టింది. ఈ తరహా వ్యవస్థను ఇప్పటి వరకు అమెరికా మాత్రమే ఉపయోగిస్తోంది. తాజాగా చైనా తన సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఒక భాగానికి ఈ అధునాతన వార్‌ఫేర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.

 ఏమిటీ ‘ఇన్ఫర్మేటైజ్‌డ్‌ వార్‌ఫేర్‌'?

ఏమిటీ ‘ఇన్ఫర్మేటైజ్‌డ్‌ వార్‌ఫేర్‌'?

ఈ మధ్య కాలంలో చైనాలో ‘ఇన్ఫర్మేటైజ్‌డ్‌ వార్‌ఫేర్‌' పదజాలం ప్రముఖంగా వినిపిస్తోంది. అంటే యుద్ధ పరిస్థితుల్లో సమాచార సాంకేతికత, డిజిటల్‌, కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోవడం అన్నమాట. చైనా సైన్యంలో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టే వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌లోని ‘ది స్కై ఉల్ఫ్‌ కమాండోస్‌'కు ‘క్యూటీఎస్‌-11' వ్యవస్థను అందించింది.

 సైనికులకు వ్యక్తిగత యుద్ధ వ్యవస్థ...

సైనికులకు వ్యక్తిగత యుద్ధ వ్యవస్థ...

చైనా ఉపయోగించే‘క్యూటీఎస్‌-11' వ్యవస్థ అచ్చం అమెరికా సైనికులు వాడే వ్యవస్థతోనే పోలి ఉంటుంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగత యుద్ధ వ్యవస్థగా పిలుస్తారు. ఈ క్యూటీఎస్‌-11 వ్యక్తిగత యుద్ధ వ్యవస్థలో ఆయుధాలతో పాటు పూర్తిగా డిజిటలైజ్‌ చేసిన ‘సమగ్ర వ్యక్తిగత సైనిక పోరాట వ్యవస్థ' ఉంటుంది. శత్రువును గుర్తించే సామగ్రి, కమ్యూనికేషన్‌ సామగ్రి ఉంటుంది.

ఏముంటుంది ఈ ‘క్యూటీఎస్-11'లో...

ఏముంటుంది ఈ ‘క్యూటీఎస్-11'లో...

డ్రాగన్ కంట్రీ తాజాగా సైన్యంలోకి ప్రవేశపెట్టిన‘ఇన్ఫర్మేటైజ్‌డ్‌ వార్‌ఫేర్‌' వ్యవస్థలో భాగమైన ‘క్యూటీఎస్-11' వ్యక్తిగత యుద్ధ వ్యవస్థలో... అసాల్ట్‌ రైఫిల్‌, ప్రత్యర్థి మూకలను నాశనం చేయగల 20 మిల్లీ మీటర్ల గ్రెనేడ్‌ లాంఛర్‌, థర్మల్‌ ఇమేజర్‌, అప్టో ఎలక్ట్రానిక్‌, పొజిషనింగ్‌ వ్యవస్థ ఉంటాయి. ఇవన్నీ ‘ఇన్ఫర్మేటెడ్‌ వార్‌ఫేర్‌'లో భాగమే. ఈ రోజుల్లో ప్రతి దేశం ఇలాంటి ఆయుధ వ్యవస్థలనే కోరుకుంటున్నాయని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

భారత్ సరిహద్దులోని బలగాలకు...

భారత్ సరిహద్దులోని బలగాలకు...

ముందుగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించే బలగాలకు ఆ తర్వాత మొత్తం సైనిక బలగాలకు ఈ ‘క్యూటీఎస్-11' వ్యవస్థలను అందించాలని చైనా సైన్యం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవస్థతో శిక్షణనిచ్చిన సైన్యంలోని ఒక శాఖను భారత సరిహద్దు వెంట మోహరించింది. చైనా సైన్యంలో వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండోస్ టీం ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతుంది. ఈ విభాగానికి చెందిన బలగాలే భారత సరిహద్దులో పహారా విధులు నిర్వర్తిస్తుంటారు. ఇప్పుడు అత్యంత అధునాత వ్యవస్థ ‘క్యూటీఎస్-11'ను చైనా ఈ బలగాలకే మొదట అందించింది.

భారత్‌పైనే చైనా నజర్...

భారత్‌పైనే చైనా నజర్...

చైనా దృష్టి ఎప్పుడూ భారత్‌పైనే ఉంటుంది. సైనిక పరంగా భారత్ శక్తియుక్తులను ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. భారత్ ఎలాంటి ఆయుధాలు సమకూర్చుకుంటుందో తెలుసుకుని దానికంటే శక్తిమంతమైన ఆయుధాలు, వ్యవస్థలను సమకూర్చుకుంటూ ఉంటుంది. భారత్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తోందని తెలియగానే తన వైమానిక దళానికి చెందిన జే-10, జే-11 యుద్ధ విమానాలను భారత సరిహద్దులో చైనా మోహరించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After reports of China upgrading its air defence along the Line of Actual Control (LAC), a report said it has equipped one its Army branch stationed at the border with US-style integrated individual soldier combat system to prepare for "informatised warfare".A Chinese Army branch Special Operations Forces from the Western Theatre Command has been equipped with QTS-11 system in their training, a report in China Central Television (CCTV) said. Military experts say the QTS-11 system is similar to the US army as it contains soldier combat system, including detection and communications, Song Zhongping, a Chinese military expert told state-run Global Times newspaper. "The individual soldier combat system is only part of the digitalised army, something countries are attempting to do. Developing the integrated individual soldier combat system adapts to informatized warfare in the future," Song said. China's sky wolf commandos have reportedly been equipped with QTS-11 system in their training.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more