వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-చైనా-నేపాల్ మధ్య కారిడార్: చైనా ప్రతిపాదన

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఖాట్మాండ్: ఇప్పటికే పాకిస్తాన్ - చైనా ఎకనామిక్ కారిడార్‌తో భారత్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న చైనా ఇప్పుడు నేపాల్‌తో మరో కారిడార్ నిర్మించాలని భావిస్తోంది. నేపాల్ పైన పట్టు బిగించేందుకు పావులు కదుపుతోంది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మంత్రివర్గంలోని కీలక మంత్రి ప్రదీప్ కుమార్ చైనా పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలోనే ఈ ప్రతిపాదన వచ్చింది. ఇండియా - నేపాల్ -చైనా కారిడార్‌కు చైనా ప్రతిపాదన తెచ్చింది.

నేపాల్, చైనా విదేశాంగ శాఖ మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. రెండు హిమాలయ ప్రాంతాలు కావడంతో సహజంగానే బహుళార్ధక ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలు ఉంటాయని చైనా విదేశాంగ మంత్రి చెప్పారు. చైనా బెల్ట్ అండ్ రోడ్డు కార్యక్రమంపై ఇటీవలే నేపాల్ సంతకాలు చేసింది. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.

 China firms up connectivity projects with Nepal, asks India to join in

చైనా, నేపాల్‌, భారత్‌లు సహజ మిత్ర దేశాలు అని, నదులు, పర్వతాలు మూడు దేశాలను కలుపుతున్నాయని వారు అన్నారు. అంతర్జాతీయంగా ఎటువంటి మార్పులు సంభవించినా మూడు దేశాల మధ్య స్నేహసంబంధాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయన్నారు. రెండు దేశాలు నేపాల్‌కు ఇతోధికంగా సాయం చేయాల్సి ఉందని చైనా విదేశాంగ మంత్రి అన్నారు. కాగా, నేపాల్ ప్రధాని చైనాకు అనుకూలురుగా ఉంటారనే వాదన ఉంది.

English summary
China today proposed an India-Nepal-China economic corridor with multi-dimensional connectivity through the Himalayas as it seeks to expand its influence over the new Nepalese government headed by Prime Minister KP Sharma Oli, widely regarded as pro-Beijing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X