వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు అలవాటే: దలైలామా, మోడీపై ప్రశంస, ట్రంప్‌పై ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా రాద్దాంతం చేయడంపై బౌద్ధ మత గురువు దలైలామా అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటనలను రాజకీయం చేయడం చైనాకు అలవాటే అన్నారు. తన విషయంలో ప్రజలను చైనా ఫూలిష్‌లుగా చేస్తోందన్నారు.

<strong>చైనా నుంచి పారిపోయి వస్తే..: గుర్తు చేసుకున్న దలైలామా</strong>చైనా నుంచి పారిపోయి వస్తే..: గుర్తు చేసుకున్న దలైలామా

అరుణాచల్‌ ప్రదేశ్‌లో తన పర్యటనపై చైనా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తవాంగ్‌లో మీ పర్యటన భారత్‌-చైనా సంబంధాలపై ప్రభావం చూపుతుందా అని అడగగా.. దీనిపై వేచి చూడాల్సి ఉందని బదులిచ్చారు.

చైనాకు ఇది కొత్తేం కాదు

చైనాకు ఇది కొత్తేం కాదు

తన ఆధ్యాత్మిక పర్యటనలకు రాజకీయ రంగు పులమడం చైనాకు కొత్త ఏమీ కాదని చెప్పారు. అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తూ చైనా తన సొంత ప్రజల్నే మోసం చేస్తోందని ఆరోపించారు. ఈ పద్ధతిని మానుకోవాలని ఆ దేశానికి సూచించారు.

చైనా అధికారిని నియమించాలి

చైనా అధికారిని నియమించాలి

అరుణాచల్‌ప్రదేశ్‌లోని మాంటిస్సోరిలో జరగుతున్న తన పర్యటనను వక్రీకరించి చైనాలో ప్రచారం చేయడం పట్ల దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. 1959లో టిబెట్‌ నుంచి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందిన తవాంగ్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. తన పర్యటనలో చైనా ఒక అధికారిని నియమించాలని కోరారు. అప్పుడైనా తాను ఎక్కడ పర్యటిస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో, ఏం చేస్తున్నానో, చైనా ప్రజలకు తెలుస్తుందన్నారు.

తెలుసుకునే హక్కు ఉంది

తెలుసుకునే హక్కు ఉంది

దలైలామా గురించి నిజం తెలుసుకోవాల్సిన హక్కు, అధికారం 135 కోట్ల చైనా ప్రజలపై ఉందని దలైలామా తెలిపారు. కేవలం తప్పుడు సమాచారాన్ని మాత్రమే తెలుసుకుంటున్నారని, నిజమేంటో తెలుసుకోవాలని చైనా ప్రజలకు సూచించారు. ఈ పర్యటన కేవలం మతానికి సంబంధిన విషయమని భారత్‌ చెబుతున్నప్పటికీ దీన్ని వక్రీకరించి మరింత క్లిష్టపరిస్థితులు ఏర్పడేలా చైనా ప్రవర్తిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మోడీకి ప్రశంసలు, ట్రంప్ విధానంపై వ్యతిరేకత

మోడీకి ప్రశంసలు, ట్రంప్ విధానంపై వ్యతిరేకత

ఎన్డీయే ప్రభుత్వ చైనా విధానం పీవీ నరసింహారావు హయాం నాటి విధానానికి దగ్గరగా ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా దలైలామా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ చురుకైన నాయకుడని, అభివృద్ధి కాముకుడని దలైలామా కితాబిచ్చారు.

ఆసియాలో సుస్థిరత కోసం భారత్‌, చైనా, పాకిస్థాన్‌లు ఐరోపా సమాఖ్య తరహాలో ఆర్థిక, సాంస్కృతిక సహకారంతో ముందుకు సాగాలన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న అమెరికాయే ముఖ్యం అనే విధానాన్ని తాను వ్యతిరేకిస్తానని చెప్పారు.

English summary
The Dalai Lama on Saturday hit out at China, accusing it of fooling its own people by spreading falsehood about his journey to Tawang, which the Communist country claims as its own.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X