వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రుడిని ఆక్రమించుకునే దిశగా చైనా: నాసా వార్నింగ్: తిప్పికొట్టిన డ్రాగన్

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా తలపెట్టిన మిషన్ మూన్‌పై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. భవిష్యత్తులో చంద్రుడిని ఆక్రమించుకునే దిశగా చైనా చర్యలు తీసుకోవచ్చంటూ ఆందోళన వ్యక్తం చేసింది. చంద్రుడిపై మరో దేశం పరిశోధనలు చేపట్టకుండా చైనా అడ్డుకునే పరిస్థితులు తలెత్తవచ్చంటూ స్పష్టం చేసింది. ఆ ఉద్దేశంతోనే చైనా.. మూన్ ఎక్స్‌ప్లొరేషన్ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు పేర్కొంది.

నాసా అధినేత బిల్ నెల్సన్.. జర్మనీకి చెందిన బిల్డ్ అనే డెయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. మూన్ ఎక్స్‌ప్లొరేషన్ కార్యక్రమం విజయవంతమైతే- చైనాను ఏ దేశం కూడా అడ్డుకోలేదని అభిప్రాయపడ్డారు. చందమామను చైనా సొంతం చేసుకుంటుందని, మరొకరు దాని మీద అడుగు పెట్టకుండా, పరిశోధనలు నిర్వహించకుండా ముందస్తు హెచ్చరికలను జారీ చేసే అవకాశాలు లేకపోలేదని నెల్సన్ తేల్చి చెప్పారు.

China has criticised warnings from the NASA chief that claimed Beijing may take over the moon

చైనా సాగిస్తోన్న మూన్ ఎక్స్‌ప్లొనేషన్ ప్రోగ్రామ్ పట్ల అన్ని దేశాలు కూడా అప్రమత్తంగా ఉండాలని, వాటిపై నిఘా ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో కొత్తపోటీ ఎదురైందని, ఈ సారి చైనాను ఎదుర్కొంటోన్నామని వ్యాఖ్యానించారు. తమ ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా కాపీ కొట్టిందనీ మండిపడ్డారాయన. ఈ వ్యాఖ్యలపై చైనా స్పందించింది. వాటిని తోసిపుచ్చింది. నాసా చీఫ్ బిల్ నెల్సన్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యమైనవని విమర్శించింది.

నాసా నుంచి అలాంటి ఆందోళన వ్యక్తమౌతుందని ఊహించలేదని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ అన్నారు. నాసా చీఫ్ చేసిన వ్యాఖ్యలను తాము ఏ మాత్రం సమర్థించట్లేదని స్పష్టం చేశారు. నిజాలు ఏమిటో తెలుసుకోకుండా నాసా చీఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారని, అవి బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని అన్నారు. బిల్ చేసిన ఈ ప్రకటన పట్ల తాము అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నామని పేర్కొన్నారు.

నాసా ఆందోళన చెందడానికి కారణాలు లేకపోలేదు. చంద్రుడిపై ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ నిర్మించాలని చైనా భావిస్తోంది. దీనికోసం మూన్ ఎక్స్‌ప్లొరేషన్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. కాంబోడియా, లావోస్, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నాంలను భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది చైనా. రష్యా కూడా సహకరించే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిణామాలు నాసా ఆందోళనకు కారణం అయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ధీటుగా చైనా తియాన్గాంగ్ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు సైతం మొదలు పెట్టింది.

English summary
China has criticised warnings from the chief of NASA that claimed Beijing may take over the moon as part of a military space programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X