వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ అరికాలి మంట నెత్తికెక్కేలా: కరోనాపై అడ్డంగా వాదిస్తోన్న చైనా: వుహాన్‌లో పుట్టలేదంటూ

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ప్రపంచ దేశాలన్నింటినీ లాక్‌డౌన్ రూపంలో స్తంభింపజేసిన అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్‌ అందరూ చెబుతున్నట్లుగా చైనాలో పుట్టుకుని రాలేదట. ఆ వైరస్ ఎక్కడ జన్మించిందో ఎవరికీ తెలియదట..చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కు కూడా. తమ దేశంలో ఆ వైరస్ లక్షణాలు కనిపించాయే తప్ప..దాని ఆరంభం ఎక్కడనే విషయం ఎవరికీ తెలియదని వాదిస్తోంది. కరోనా మహమ్మారి ఎక్కడ జన్మించిందనే విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ (WHO) కూడా ధృవీకరించలేకపోయిందని, అలాంటిది తామే కారణమని ఎలా ఆరోపిస్తారని ఎదురుదాడికి దిగుతోంది.

రైలు టికెట్లు తీసుకోవడం గగనం: తత్కాల్, కరెంట్ బుకింగ్‌పై కీలక నిర్ణయం: అలాంటి టికెట్లు చెల్లవురైలు టికెట్లు తీసుకోవడం గగనం: తత్కాల్, కరెంట్ బుకింగ్‌పై కీలక నిర్ణయం: అలాంటి టికెట్లు చెల్లవు

చైనాపై అమెరికా ఆగ్రహానికి..

చైనాపై అమెరికా ఆగ్రహానికి..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని పట్టి పీడించడానికి ప్రధాన కారణం చైనా అని బలంగా నమ్ముతోంది అమెరికా. ఈ దిశగా ఇప్పటికే కొన్ని ఆరోపణలను కూడా సంధించింది. చైనాకు వత్తాసు పలుకుతోందనే కారణంతో చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా నిప్పులు చెరిగారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా వాటా కింద ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేసే నిధులను సైతం నిలిపివేయడానికి ఆయన ఏ మాత్రం వెనుకాడలేదు. చైనాపై ఈ స్థాయిలో అమెరికా ఆగ్రహావేశాలను ప్రదర్శించడానికి కారణం అందరికీ తెలిసిందే. ఈ వైరస్ వల్ల అమెరికా ఏ స్థాయిలో ప్రాణ నష్టాన్ని చవి చూస్తోందనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని అంశం.

ఈ నష్టానికి చైనా బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ..

ఈ నష్టానికి చైనా బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ..

కరోనా వల్ల అమెరికాలో చోటు చేసుకన్న నష్టానికి చైనా బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కొద్దిరోజుల కిందట ఆ దేశ స్టేట్స్ కార్యదర్శి మైక్ పాంపియో ఆరోపించారు. వుహాన్‌ ల్యాబ్‌లో ఈ వైరస్ పుట్టిందనే అనుమానాలను సైతం పాంపియో ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. పలు సందేహాలతో కూడిన ఓ జాబితాను ఆయన అప్పట్లో విడుదల చేశారు. మొత్తం 24 ప్రశ్నలకు ఆయన సంధించారు. ల్యాబ్‌లో కృత్రిమంగా దాన్ని సృష్టించి, విడుదల చేశారని.. దీనికి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని అమెరికా పేర్కొన్నారు.

 వాటికి సమాధానం ఇచ్చిన చైనా

వాటికి సమాధానం ఇచ్చిన చైనా

అమెరికా ప్రస్తావించిన ప్రశ్నలు, లేవనెత్తిన అనుమానాలకు సమాధానం ఇచ్చింది చైనా. ఒక్కో ప్రశ్నకు సమధానాన్ని ఇస్తూ.. ఓ జాబితాను రూపొందించింది. దాన్ని మీడియాకు విడుదల చేసింది. వుహాన్‌లో కరోనా వైరస్ పుట్టుకొచ్చిందనడం సహేతుకం కాదని, అదెక్కడ జన్మించిందనే విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ సైతం స్పష్టం చేయలేకపోయిందని పేర్కొంది. మొట్టమొదటి కేసు వుహాన్‌లో నమోదైనంత మాత్రాన.. ఆ వైరస్ తమ దేశంలోనే జన్మించిందనడం సబబు కాదని స్పష్టం చేసింది. వుహాన్ ల్యాబ్‌లో కృత్రిమంగా స్పష్టించినది కాదని, వైరస్ లక్షణాలను బట్టి చూస్తే.. అది సహజసిద్ధంగా రూపాంతరం చెందినదేనని పేర్కొంది.

Recommended Video

Indian Railways To Resume Passenger Train Services From May 12
 అరికట్టడానికి అన్ని చర్యలూ

అరికట్టడానికి అన్ని చర్యలూ

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి చైనా నిర్లక్ష్యమే ప్రధాన కారణమంటూ అమెరికా చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిందా డ్రాగన్ కంట్రీ. వైరస్ వెలుగు చూసిన వెంటనే దాన్ని నియంత్రించడానికి కఠిన నిర్ణయాలను తీసుకున్నామని, వాటిని యుద్ధ ప్రాతిపదికన అమలు చేశామని వివరించింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) గానీ, ఆ పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న ప్రభుత్వం గానీ.. వైరస్ వ్యాప్తి చెందడానికి ఎలాంటి కారణం కాదని తేల్చి చెప్పింది. దీనిపై తాము అన్ని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశామని, విమాన సర్వీసులను నిలిపివేశామని పేర్కొంది.

English summary
China has issued a lengthy rebuttal of what it said were 24 “preposterous allegations” by some leading US politicians over its handling of the new coronavirus outbreak. A 30-page, 11,000-word article posted on the ministry website on Saturday night repeated and expanded on the refutations made during the press briefings. “Secretary Pompeo, State Department Spokesperson and others seemed to be busy taking interviews lately, where they continued unwarranted attacks against China on COVID-19, accusing China of not acting fast enough or providing accurate data, and calling for investigations to hold it accountable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X