వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతిమంత్రం: నో కోల్డ్ వార్, హాట్ వార్.. యుద్ధాన్ని కోరుకోవడం లేదు: జిన్ పింగ్..

|
Google Oneindia TeluguNews

సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతూనే శాంతి మంత్రం జపించింది డ్రాగన్ చైనా. గత కొద్దిరోజులుగా తూర్పు లడాఖ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇరుదేశాల అధికారుల మధ్య విడతలవారీగా చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వైఖరికి విభిన్నంగా శాంతి అంటూ కామెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటు భారత్ బలగాల దూకుడు, అటు అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర చేయడంతో చైనా మధ్యేమార్గాన్ని ఎంచుకుంది. ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశం సందర్భంగా జిన్ పింగ్ మాట్లాడారు. అయితే కరోనా వైరస్ సందర్భంగా నేతలంగా వర్చువల్ విధానంలో వీడియో సందేశం పంపించారు. జిన్ పింగ్ కూడా అదేవిధంగా మేసెజ్ సెండ్ చేశారు. తమకు కోల్డ్ వార్, హాట్ వార్ ఏదీ అవసరం లేదని.. తాము యుధ్దాన్ని కోరుకోవడం లేదని వైఖరిని కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు.

China has no intention to fight a war Xi Jinping at UNGA

Recommended Video

BJP Didn’t Fight Nizam, Congress Did, Says Uttam Kumar Reddy | Oneindia Telugu

అయితే దేశాల మధ్య బేదాభిప్రాయాలు ఉండటం సహజమేనని మాత్రం జిన్ పింగ్ అంగీకరించారు. వాటిని చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ది చెందుతోన్న చైనా.. శాంతియుత, సహకార సంబంధ అభివృద్దికి కట్టుబడి ఉందని చెప్పారు. చైనా ఎప్పటికీ విస్తరణ, ఆధిపత్యాన్ని కోరుకోదు అని చెప్పారు. అదే సమయంలో ఇతర దేశాలతో ఉన్న విభేదాలను తగ్గించుకుంటామని తెలిపారు. చర్చలతో వివాదాలను పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్త నెలకొన్న సమయంలో జిన్ పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

English summary
China has no intention to fight a war Xi Jinping at United Nations General Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X