• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అదే దూకుడు.. సంక్షోభంలోనూ వెనక్కి తగ్గని చైనా.. డిఫెన్స్ బడ్జెట్‌ ఎంతో తెలుసా..

|

కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి తెరపడి ఆసియా దేశాలు ప్రపంచంపై పట్టు బిగించే అవకాశాలున్నాయని ఇటీవలి కాలంలో పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ముఖ్యంగా చైనా,సింగపూర్,జపాన్ దేశాలు ఆ దిశగా ముందు వరుసలో ఉంటాయని అంటున్నారు. భవిష్యత్తులో ఈ అంచనాలు ఎంతమేర నిజమవుతాయో తెలియదు గానీ.. చైనా మాత్రం అగ్రరాజ్యం అమెరికాను తలదన్నేలా ఆధిపత్యం కోసం ప్రణాళికలు రచిస్తోంది. తాజా కరోనా సంక్షోభం కుదిపేస్తున్న తరుణంలోనూ చైనా తమ రక్షణ రంగానికి నిధులను పెంచడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

రక్షణ రంగ బడ్జెట్‌పై ముసాయిదా బిల్లు

రక్షణ రంగ బడ్జెట్‌పై ముసాయిదా బిల్లు

అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రెండో సైనిక వ్యవస్థను కలిగివున్న చైనా.. తాజాగా తమ రక్షణ రంగానికి 6.6శాతం బడ్జెట్‌ను పెంచి 179 అమెరికన్ డాలర్లను కేటాయించాలని నిర్ణయించింది. అయితే వృద్ది రేటు పరంగా ఇది తక్కువే అని చెప్పాలి. గత ఐదేళ్లుగా రక్షణ రంగ కేటాయింపులు డబుల్ డిజిట్‌ వృద్ది రేటు నుంచి సింగిల్ డిజిట్ వృద్ది రేటుకు పడిపోయాయి. అయినప్పటికీ తాజా కేటాయింపులు భారత్‌తో పోలిస్తే మూడు రెట్లు అత్యధికం. శుక్రవారం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(NPC) ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లులో ఈ వివరాలను పొందుపరిచారు.

అనధికారికంగా చైనా ఇంకా ఎక్కువే ఖర్చు చేస్తోందా..

అనధికారికంగా చైనా ఇంకా ఎక్కువే ఖర్చు చేస్తోందా..

దాదాపు 20లక్షల మందితో చైనా మిలటరీ శత్రు దుర్భేద్యంగా ఉంది. తాజా ముసాయిదా ప్రకారం చైనా రక్షణ రంగ బడ్జెట్ ఈ ఏడాది 1,27 ట్రిలియన్ యువాన్లు(179 అమెరికన్ డాలర్లు). గతేడాది ఈ కేటాయింపులు 177.76 అమెరికన్ డాలర్లుగా ఉన్నాయి. గత కొన్నేళ్లల్లో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్,న్యూక్లియర్-పవర్డ్ సబ్‌మెరైన్స్ వంటి వాటిని చైనా స్వదేశంలోనే తయారుచేసుకుంది. తాజా బడ్జెట్‌ను మిలటరీ పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. నిజానికి అధికారికంగా బయటకొచ్చిన ఈ లెక్కల కంటే.. చైనా ఇంకా ఎక్కువ మొత్తంలోనే మిలటరీపై ఖర్చు చేస్తోందని విదేశీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  UK Court Orders Anil Ambani To Pay $717 mn To Chinese Banks
  ఎందుకింత బడ్జెట్..

  ఎందుకింత బడ్జెట్..

  ఈ సంవత్సరం బడ్జెట్‌తో చైనా నావికాదళాన్ని విస్తరించే యోచనలో చైనా ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై చాలాకాలంగా పట్టు కోసం చూస్తోన్న చైనా.. నావికా దళాన్ని మరింత పటిష్టం చేసే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. అలాగే పశ్చిమ పసిఫిక్,హిందూ మహాసముద్రంలోనూ తన సైనిక ఉనికిని విస్తరించే యోచనలో చైనా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తైవాన్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు అవసరమైతే సైనిక శక్తిని ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో అత్యాధునిక నిఘా వ్యవస్థ రూపకల్పన,యుద్ద విమానాల సంఖ్య పెంపుపై చైనా ఫోకస్ చేసింది.

  English summary
  China will increase its defence spending by 6.6% in 2020, the lowest rate in years as it battles an economic crisis brought on by the coronavirus outbreak, the government said Friday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X