వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా వక్రబుద్ధి: అరుణాచల్‌ప్రదేశ్‌ను తమదేశంలో భాగంగా కొత్త మ్యాప్ విడుదల

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బీజింగ్: ఇప్పటికే టిబెట్ లాంటి పలు దేశాల ఆక్రమణకు పాల్పడిన చైనా.. మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. మనదేశంలో అంతర్భాగమైన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని తమ దేశ భూభాగంలో చూపిస్తూ కొత్తగా చిట్రపటాన్ని విడుదల చేసింది.

అరుణాచల్‌ను దక్షిణ టిబెట్ అంటూ..

అరుణాచల్‌ను దక్షిణ టిబెట్ అంటూ..

చైనా డిజిటల్ మ్యాప్‌ల సాధికారిక సంస్థ అయిన స్కూమాప్ ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ సంస్థ బీజింగ్ నేషణల్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణ టిబెట్ అంటూ పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే చైనా కుట్రపై భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, చైనా జోక్యం మంచిది కాదని పలుమార్లు హెచ్చరించింది. అయినప్పటికీ చైనా తన కుట్రలను మానుకోవడం లేదు.

ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించి..

ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించి..

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మెక్ మోహన్ రేఖ ఏర్పాటు అయ్యే వరకూ(1938) కూడా భారత్-టిబెట్ దేశఆల మధ్య సరిహద్దుగా ఉండేది. అయితే, చైనా 1951లో టిబెట్‌ను ఆక్రమించుకుంది. ఆ తర్వాత టిబెట్‌నూ కూడా తమ దేశంలో భాగంగా చూపుకుంటూ వస్తోంది చైనా. చైనాకు రష్యా మధ్య ఆసియా దేశాలతోనూ సరిహద్దు సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకుంది. కానీ, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మాత్రం తన వక్రబుద్ధిని మానుకోవడం లేదు. చైనా.. టిబెట్‌నే కాదు 37000 చ.కి.మీల ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకుంది. ఇది జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అంతర్భాగమే కావడం గమనార్హం.

Recommended Video

COVID-19 : Cabinet Approves Ordinance To Protect Health Workers
టిబెట్‌ను ఆక్రమించిన నాటి నుంచి అరుణాచల్‌పై కుట్రలు

టిబెట్‌ను ఆక్రమించిన నాటి నుంచి అరుణాచల్‌పై కుట్రలు


1951లో టిబెట్ దేశాన్ని ఆక్రమించుకున్న చైనా అప్పటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై కన్నేసింది. తమ ప్రాంతమంటూ వాదిస్తోంది. కేంద్రమంత్రులు వెళ్లిన సమయంలోనూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. అయితే, చైనా కుట్రలకు భారత్ ధీటుగానే జవాబు ఇస్తూ వస్తోంది. అయినా చైనా మాత్రం తన వక్రబుద్ధిని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంది. స్వతంత్ర దేశమైన తైవాన్‌ను కూడా తమ దేశంలో భాగమేనంటూ చైనా ప్రపంచ దేశాలను నమ్మించే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.

English summary
Arunachal: In the latest version of Sky map which is China’s authority on digital maps, Arunachal Pradesh is shown as part of China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X