వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా మరో షాకింగ్ నిర్ణయం: ఆ బోర్డర్ వెంట ముళ్ళ తీగలతో 2 వేల కిలోమీటర్ల అతి పెద్ద గోడ నిర్మాణం

|
Google Oneindia TeluguNews

చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మయన్మార్ సరిహద్దు వెంబడి రెండు వేల కిలోమీటర్ల పొడవున అతి పెద్ద ముళ్ళ తీగలతో నిర్మాణం చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. అక్రమ చొరబాట్లను నివారించడానికి చైనా తన దక్షిణ సరిహద్దు మయన్మార్ వెంట 2000 కిలోమీటర్ల పొడవైన ముళ్ల తీగలతో గోడను నిర్మించే పనిలో ఉంది.

Recommended Video

India China Stand Off : దక్షిణ సరిహద్దు Myanmar వెంట 2000 కిమీ పొడవైన గోడను నిర్మించిన China
మయన్మార్ బోర్డర్ వెంట చైనా ఫెన్సింగ్ నిర్మాణం .. చొరబాట్లను ఆపటానికే అన్న చైనా

మయన్మార్ బోర్డర్ వెంట చైనా ఫెన్సింగ్ నిర్మాణం .. చొరబాట్లను ఆపటానికే అన్న చైనా

నివేదికల ప్రకారం, మయన్మార్ సైన్యం తన సరిహద్దులో గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుండగా, చైనా మాత్రం నిర్మాణంపై చాలా స్ట్రాంగ్ గా ఉంది. మయన్మార్ నుండి దేశంలోకి ప్రవేశిస్తున్న అక్రమ చొరబాటుదారులను అడ్డుకోవటం తమ నిర్మాణ లక్ష్యమని చైనా ప్రకటించుకుంది. అయితే అంతర్జాతీయంగా మయన్మార్ సరిహద్దు వెంట చైనా చేపడుతున్న నిర్మాణంపై చర్చ జరుగుతుంది . అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కొత్త వాదన వినిపిస్తున్నారు. చైనా తమ దేశంలో ఉన్న తిరుగుబాటుదారులను, ప్రభుత్వ వ్యతిరేకులను దేశం సరిహద్దు దాటకుండా ఉండటం కోసం ఈ నిర్మాణం చేపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

విస్తరణవాద ఆలోచనను ప్రతిబింబిస్తుందని అమెరికా ఆందోళన

విస్తరణవాద ఆలోచనను ప్రతిబింబిస్తుందని అమెరికా ఆందోళన

మరోవైపు మయన్మార్ గోడ వెంట ముళ్ళ తీగలతో చైనా చేపడుతున్న అతి పెద్ద నిర్మాణంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా చేస్తున్న ప్రయత్నం దాని విస్తరణవాద ఆలోచనను ప్రతిబింబిస్తుందని, రాబోయే దశాబ్దాల్లో దక్షిణాసియాలో సంఘర్షణ గణనీయంగా పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. చైనా ప్రభుత్వం మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ తన నివేదికలో ఈ ముళ్ళ తీగలతో కూడిన నిర్మాణం చేపట్టడం దేశంలోని మయన్మార్ నుండి అక్రమ చొరబాట్లను అరికట్టడమేనని పేర్కొంది.

యునాన్ ప్రావిన్స్లో 9 మీటర్ల ఎత్తులో ముళ్ల తీగతో ఫెన్సింగ్ .. వ్యతిరేకిస్తూ మయన్మార్ లేఖ

యునాన్ ప్రావిన్స్లో 9 మీటర్ల ఎత్తులో ముళ్ల తీగతో ఫెన్సింగ్ .. వ్యతిరేకిస్తూ మయన్మార్ లేఖ

చైనా యొక్క నైరుతి యునాన్ ప్రావిన్స్లో 9 మీటర్ల ఎత్తులో ముళ్ల తీగతో ఈ గోడను నిర్మిస్తున్నారు. ఇంతలో, చైనా చర్యను మయన్మార్ సైన్యం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సైన్యం చైనా అధికారులకు ఒక లేఖ రాసింది . మయన్మార్ బోర్డర్ వెంట ముళ్ల తీగను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ తాము చెప్పదలచుకున్నది లేఖలో ప్రస్తావించింది. ఈ లేఖలో 1961 లో సరిహద్దు ఒప్పందం గురించి మయన్మార్ ప్రస్తావించింది. ఈ నిబంధనలలో సరిహద్దు 10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణాన్ని నిర్మించకూడదు అని పేర్కొంది.

డిసెంబర్ 13 నుండి ఫెన్సింగ్ పనులు మొదలు పెట్టిన చైనా .. మయన్మార్ ఏం చేస్తుంది ?

డిసెంబర్ 13 నుండి ఫెన్సింగ్ పనులు మొదలు పెట్టిన చైనా .. మయన్మార్ ఏం చేస్తుంది ?

అయినప్పటికీ చైనా డిసెంబర్ 13 నుండి చైనా పోస్ట్ నంబర్ బిపి -125 దగ్గర ఫెన్సింగ్ పనిని ప్రారంభించిందని మయన్మార్ స్థానిక మీడియా కథనాల ప్రకారం తెలుస్తుంది . చైనా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక విస్తరణ ఆకాంక్ష ఎక్కువగా ఉందని, ఎలాంటి దురాలోచనలు లేకుండా చైనా ఈ నిర్మాణాన్ని చేయడం లేదని డ్రాగన్ కంట్రీ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మయన్మార్ చైనా చర్యను ఎలా ఎదుర్కోవాలా అమ్మ ఆలోచనలో పడింది.

English summary
China is in the process of building a 2000 km long barbed wire wall along its southern border of Myanmar to prevent illegal crossings, while the Myanmar army is opposing the construction of the wall along its border, China is firm on its stand
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X