వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాకు షాక్: తేలికపాటి యుద్ద ట్యాంక్ తయారుచేసిన చైనా

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా జెడ్‌టీక్యూ-105 పేరుతో కొత్త తరహ యుద్ద ట్యాంక్‌ను తయారు చేస్తోంది. ఈ ట్యాంక్‌ను టిబెట్ ప్లాటూన్‌లో పరీక్షిస్తోంది.చైనా ఈ యుద్ద ట్యాంక్‌ను అభివృద్ది చేస్తోంది. పర్వతాలను వేగంగా అధిరోహించే విధంగా ఈ ట్యాంక్‌ను తయారు చేస్తోంది.అయితే ఇండియాను లక్ష్యంగా చేసుకొని ఈ యుద్ద ట్యాంక్‌ను అభివృద్ది చేసినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని మాత్రం చైనా ఖండిస్తోంది.

China is Developing a New Super Tank

చైనా మాత్రం ఈ ట్యాంక్‌ విషయంలో అత్యంత గోప్యతను పాటిస్తోంది. 2011లో దీని నిర్మాణం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మాత్రం కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి.

ఇటీవల జెడ్‌టీక్యూ 105 ట్యాంకులను టిబెట్‌లో పరీక్షిస్తున్న దృశ్యాలను చైనా అధికారిక మీడియా ప్రసారం చేసింది. ఈ ట్యాంకుల బరువు 33-36టన్నులు ఉండవచ్చని అంచనా. రష్యా, ఇతర పాశ్చాత్య దేశాల ట్యాంకుల బరువు 50 నుంచి 70 టన్నుల వరకు ఉంటాయి.

జెడ్‌టీక్యూ 105 ట్యాంకులను టిబెట్‌లోని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఇంటిట్రేటెడ్‌ బ్రిగేడ్‌కు అప్పజెప్పవచ్చనే ప్రచారం సాగుతోంది.

హిమాలయాల్లో చైనా వైమానిక దళం నిర్వహించే కార్యకలాపాల్లో ఇది కీలక పాత్రను పోషించనుంది. భారత్‌ వద్ద టి-90ఎస్‌ ట్యాంకుల కంటే ఇవి చాలా ఆధునికమైనవని చైనా ప్రచారం చేస్తోంది.

భారత్‌ కూడా తేలికపాటి ట్యాంక్‌ను అభివృద్ధి చేసే పనిలో పడింది. కార్గిల్‌ యుద్ధ సమయంలో తేలిక పాటి ట్యాంకుల అవసరాన్ని భారత్‌ గుర్తించింది.

English summary
In June 2017, the Chinese periodical Guancha reported that the Xinqingtan (literally “New Light Tank”), a mountain-going tank formerly known by the equally generic appellation ZTQ-105, had entered trials in Tibetan Plateau. The newspaper characterized these as “a show of force designed to deter the Indian military,” while a military spokesman stated on June 29 they were “aimed to test the tank’s performance and are not targeted at any country.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X