వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మగెడాన్: గ్రహశకలంపైనా మైనింగ్: చైనా దేన్నీ వదలట్లేదుగా: హాలీవుడ్ దర్శకుడి పెట్టుబడులు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసిన సన్నివేశాలు ఎప్పటికీ నిజం కాలేవు అనే బలమైన నమ్మకం జనంలో ఉంది. భూమి మీదికి దాడికి వచ్చిన ఏలియన్లతో ఫైట్ చేయడం, భూగోళాన్ని తాకడానికి వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే అస్టరాయిడ్లను నాశనం చేయడం.. ఇవన్నీ ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే సన్నివేశాలు. అలాంటివి వాస్తవ రూపం దాల్చుతాయనే విషయం కనీసం ఊహకు కూడా అందదు. అసాధ్యం అనుకున్న అలాంటి సంఘటనలు వాస్తవ రూపం దాల్చితే.. అదొక మహాద్భుతమే అవుతుంది.

A Flying Jatt పూరన్: కాలు విరిగిన స్థితి నుంచి గాల్లోకి ఎగిరే దాకాA Flying Jatt పూరన్: కాలు విరిగిన స్థితి నుంచి గాల్లోకి ఎగిరే దాకా

గ్రహశకలంపై మైనింగ్..

గ్రహశకలంపై మైనింగ్..

అస్టరాయిడ్లపై మైనింగ్.. అర్థం అయ్యేలా చెప్పుకోవాలంటే.. గ్రహశకలంపై ఖనిజల అన్వేషణ. భూమి పొరల్లో నిల్వ ఉన్న ఖనిజ నిక్షేపాలను వెలికి తీస్తున్నట్టే.. గ్రహశకలాల్లో నుంచి ఖనిజాలను కనుగొనే ప్రయత్నాలకు తెర తీసింది చైనా. సెకెనుకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అస్టరాయిడ్లపై తవ్వకాలను చేపట్టబోతోంది. దీనికోసం ఓ రోబోను తయారు చేసింది. దీన్ని ఈ ఏడాది నవంబర్‌లో అంతరిక్షంలోకి ప్రయోగించబోతోంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది డ్రాగన్ కంట్రీ.. గప్‌చుప్‌గా. ఇలాంటి రోబో ఒకటి చైనాలో తయారవుతోందనే విషయం ఇప్పటిదాకా బాహ్య ప్రపంచానికి తెలియలేదట.

ఎవరు తయారు చేశారు?

ఎవరు తయారు చేశారు?

గ్రహశకలంపై తవ్వకాలను చేపట్టి.. ఖనిజ నిక్షేపాలను వెలికి తీయడానికి ఉద్దేశించిన రోబోను చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ రూపొందించింది. రాజధాని బీజింగ్ కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోన్న ఆ సంస్థ పేరు- ఒరిజిన్ స్పేస్. నియో-1 పేరుతో రోబోను తయారు చేసింది. దీని బరువు 30 కేజీలు మాత్రమే. వచ్చే నవంబర్‌లో దీన్ని అంతరిక్షంలో ప్రయోగించబోతున్నట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. నవంబర్‌లో ప్రయోగించబోయే లాంగ్ మార్చ్ రాకెట్‌లో సెకెండరీ పేలోడ్‌గా ఈ రోబోను అంతరిక్షంలోకి పంపించబోతున్నామని ఒరిజిన్ స్పేస్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు యు తియాంగ్‌హోంగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 50 మిలియన్ డాలర్ల వ్యయం..

50 మిలియన్ డాలర్ల వ్యయం..

ఈ ప్రాజెక్టు కోసం 50 మిలియన్ డాలర్లను వ్యయం చేసినట్లు తియాంగ్‌హోంగ్ తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమౌతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అదే జరిగితే- అంతరిక్ష ప్రయోగాల్లో ఓ నూతన శకానికి నాంది పలికినట్టవుతుందని అన్నారు. భూమిపై లేని అత్యంత విలువైన ఖనిజ సంపద గ్రహశకలాల్లో ఉందని, దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మానవ ప్రయోజనాల కోసం ఆ ఖనిజాలను మళ్లించాల్సి ఉందని అన్నారు. ఖనిజాలతో నీటి జాడలు కూడా గ్రహశకలాల్లో లభించే అవకాశాలు లేకపోలేదని తియాంగ్‌హోంగ్ అంచనా వేశారు.

 జేమ్స్ కామెరాన్ పెట్టుబడులు..

జేమ్స్ కామెరాన్ పెట్టుబడులు..

ఈ ప్రాజెక్టులో ఉన్న ట్విస్ట్ ఏమిటంటే.. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఈ ప్రాజెక్టులో పెట్టబడులు పెట్టారు. సైన్స్ ఫిక్షన్ సినిమాలు.. ప్రత్యేకించి - అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన మూవీలను తెరకెక్కించడంలో కామెరాన్ సిద్ధహస్తుడు. ఆయన ఒక్కరే కాదు.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, మాజీ చీఫ్ ఎరిక్్ ష్మిడ్ ఈ ప్రాజెక్టులో భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఇక ముందూ దాన్ని కొనసాగిస్తామని తియాంగ్‌హోంగ్ పేర్కొన్నారు.

బంగారం కంటే విలువైన..

బంగారం కంటే విలువైన..

భూమ్మీద లభించే బంగారం కంటే విలువైన ఖనిజ సంపద గ్రహశకలాల్ల నిక్షిప్తమై ఉందనే అభిప్రాయాలు, అధ్యయనాలు ఇప్పటిదాకా చాలా వెలువడ్డాయి. బంగారం, కోబాల్ట్, ఐరన్, మాంగనీస్, మాలిబ్డెనిమ్, నికెల్, ప్లాటినం, టంగ్‌స్టీల్.. ఇలా విలువైన ఖనిజాలు ఉంటాయంటూ ఇప్పటిదాకా పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. వాటిని వెలికి తీయడానికి ఇదివరకు నాసా కొన్ని ప్రయోగాలను చేపట్టింది. ఈ దిశగా అమెరికా ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా కేటాయించింది. నాసా తన ప్రయోగాలను కొనసాగిస్తోన్న సమయంలోనే.. చైనాకు చెందిన ఒరిజిన్ స్పేస్ మరో అడుగు ముందుకేసింది. మైనింగ్ రోబోను పంపించబోతోంది.

English summary
China start-up is all set to send a ‘Asteroid mining robot’ in November. A Beijing-based private space resources company, Origin Space has even taken initial steps towards testing capabilities in a bid to identify and extract the off-Earth resources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X