వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖం ద్వారా: కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు తీసుకునే కొత్త టెక్నాలజీ మిషిన్‌లను చైనా ప్రారంభించింది. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి... మన ముఖమే ఏటీఎం కార్డులా పని చేస్తుంది! తాజా టెక్నాలజీ ద్వారా జేబులో పెట్టుకోవాల్సిన ఏటీఎం కార్డుతో అవసరమే ఉండదు.

కార్యాలయంలో అటెండెన్సు కోసం వాడే బయోమెట్రిక్ సాంకేతిక.. ఐరిస్ ఆధారంగా హాజరు పడుతుంది. దానినే కొంచెం మార్చి ముఖాన్ని గుర్తించి, ఒక పాస్ వర్డ్ అడిగి, దానిని బట్టి ఖాతాకు సంబంధించిన కార్యకలాపాలు చేసుకునే సరికొత్త టెక్నాలజీని చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు.

 China launches country's first cash machines using facial recognition technology

ఇలాంటి పది మిషన్లను చైనా మర్చంట్ బ్యాంక్ వివిధ నగరాలలో ఏర్పాటు చేసింది. ముఖాన్ని స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన బ్యాంకు కార్యకలాపాలను ఈ మిషన్ల ద్వారా నిర్వహించుకోవచ్చు. టెలిఫోన్ నెంబర్లను కూడా పాస్ వర్డుగా ఎంటర్ చేయాలి.

మరో విషయమేమంటే... అచ్చం ఒకేలా ఉండే కవలు ఇద్దరు వచ్చినా కూడా వాళ్లలో ఎవరి అకౌంటును వాళ్లకే యాక్టివేట్ చేసేలా ఈ సాంకేతికత ఉంది. కళ్లజోడు పెట్టుకున్నా, మేకప్ వేసుకున్నా మీ ముఖాన్ని గుర్తిస్తుంది. దీని ద్వారా కేవలం 42 సెకన్లలోనే డబ్బు డ్రా చేసుకోవచ్చు.

English summary
China launches country's first cash machines using facial recognition technology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X