వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోమలకు గర్బనిరోదక వాక్సీన్.. వినూత్న ప్రయోగం చేస్తున్న చైనా..!ఇక దోమ జాతి అంతమే..!!

|
Google Oneindia TeluguNews

బీజింగ్/హైదరాబాద్ : అవినీతీ రహిత సమాజం లాగా దోమ రహిత సమాజాన్ని త్వరలో మనం చూడబోతున్నమా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. అందుకోసం చైనా దేశం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, జికా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తున్న దోమలను అరికట్టేందుకు వాటిపైకి దోమలనే ప్రయోగించి విజయం సాధించిచారు చైనాకు చెందిన ఓ ప్రొఫెసర్.

చైనాలోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్సుకు చెందిన ప్రొఫెసర్ గ్జి జియాంగ్ ప్రస్తుతం సన్ యెట్ సేన్ విశ్వవిద్యాలయంలో మెక్రోబలయాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. పరిశోధనలో భాగంగా ఆయన నేతృత్వంలోని నిపుణుల బృందం 10 లక్షల మగ దోమలను నగరంలోకి వదిలిపెట్టింది. ఈ దోమల్లో వాల్బాచియా అనే బ్యాక్టీరియాను జొప్పించింది. ఈ బ్యాక్టీరియా ఉన్న జీవులు మనుషులను కుట్టవు. అంతేకాకుండా ఈ మగ దోమలతో కలిశాక ఆడ దోమలు పెట్టిన గుడ్లు ఫలదీకరణం చెందవు.

China launches innovative vaccine against mosquitoes..!

ఈ ప్రయోగం కారణంగా గత రెండేళ్లలో ప్రావిన్సులోని దోమల సంతతి గణనీయంగా తగ్గిపోయింది. కాగా, ప్రొఫెసర్ గ్జి జియాంగ్ ప్రయోగం కారణంగా రెండేళ్ల కాలంలో గ్యాంగ్ డాంగ్ ప్రావిన్సులో ఓ జాతి దోమలు పూర్తిగా అంతర్ధానమైపోయాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రొఫెసర్ జియాంగ్ కొందరు అమెరికా పరిశోధకులతో కలిసి 2016 నుంచి ఈ ప్రయోగాలు చేపట్టినట్లు పేర్కొన్నాయి.

కాగా, ఈ ప్రయోగం విజయవంతమైతే దోమల ద్వారా వ్యాపించే అంటు వ్యాధులకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చనీ, పంటలకు చీడ పట్టకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దోమల నియంత్రణకు వాడుతున్న రసాయనాల వాడకం కూడా గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. దోమ రహాత సమాజం కోసం చైనా చేస్తున్న ప్రయోగం సఫలం ఎన్నో దేశాలు ఆ దేశాన్ని అనుసరిస్తాయనే చర్చ జరుగుతోంది.

English summary
Are we going to see a mosquito-free society like a free corrupt society? That is what the answers sound like. That is why China is embarking on an innovative program. A professor from China has been successful in mosquito-borne diseases to prevent mosquito-borne diseases such as malaria, dengue, chikungunya and Zika.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X