వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

68రోజుల్లోనే సరికొత్త రికార్డు సృష్టించారు ఈ తాత

|
Google Oneindia TeluguNews

ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జాంగ్‌బో. వయస్సు 57 ఏళ్లు. చైనా దేశానికి చెందిన వాడు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. జాంగ్‌బో 68 రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టుముట్టేశాడు. ఎలా అంటారా ఒక చిన్న విమానంలో ప్రయాణించి ఈ ఘనత సాధించారు. ఏప్రిల్ 2వ తేదీన చికాగో విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న జాంగ్‌బో 50 చోట్ల మాత్రమే ఆగాడు.

మూడు ఖండాలు, మూడు మహాసముద్రాలు దాటుకుంటూ 21 దేశాలను కవర్ చేశాడు. దాదాపు 41వేల కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి చికాగో విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ల్యాండ్ అయ్యారు. ల్యాండింగ్‌ కంటే ముందు చికాగో విమానాశ్రయంపై నాలుగుసార్లు చక్కర్లు కొట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు.అంతకుముందు జాంగ్ మరో చరిత్ర క్రియేట్ చేశాడు. ఆగష్టు 7,2016లో ప్రొఫెల్లర్‌ ద్వారా నడిచే విమానంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చారు. కేవలం 49 రోజుల్లో పర్యటన ముగించుకుని అదే ఏడాది సెప్టెంబర్‌ 24న ల్యాండ్ అయ్యారు. అయితే తొలిసారి కంటే రెండో సారి వెళ్లినప్పుడే చాలా కష్టంగా ఉన్నిందని జాంగ్‌బో తెలిపాడు. గాల్లో ఉన్న సమయంలో కొన్ని సాంకేతిక కారణాలు కూడా ఇబ్బందులకు గురిచేశాయని జాంగ్‌బో గుర్తు చేసుకున్నాడు.

China man completes world tour in just 68 days

ఇక ఆర్కిటిక్ ప్రాంతంపై విమానం ఎగురుతున్న సమయంలో చాలా కష్టపడినట్లు చెప్పారు జాంగ్ బో. చికాగో నుంచి టేకాఫ్ తీసుకున్న తర్వాత ఆర్కిటిక్ సర్కిల్‌కు ఉత్తర దిశగా ప్రయాణించినట్లు చెప్పాడు. అప్పటికీ వాతావరణం చాలా చల్లగా ఉన్నిందని తెలిపాడు. 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో తాను 15000 అడుగుల ఎత్తులో ప్రయాణించినట్లు చెప్పిన జాంగ్‌బో అక్కడ వాతావరణం మైనస్ 50 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్నిందని చెప్పారు.

తాను ప్రయాణించిన డీఏ 42 ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్ కండీషనింగ్ సిస్టం ఉండదని చెప్పారు. దీంతో తను ఓ స్పెషల్ కిట్‌ను ధరించినట్లు చెప్పాడు. అది ధరిస్తే వెచ్చగా ఉంటుందని చెప్పిన జాంగ్‌బో ఇక అట్లాంటిక్ మహాసముద్రంపై వెళుతుండగా పెద్దగాలులు వీచాయని చెప్పారు. ఆ సమయంలో విమానం స్పీడు గంటకు 110 కిలోమీటర్ల వేగం నుంచి 120 కిలోమీటర్ల వేగానికి పడిపోయినట్లు చెప్పారు.

ఇది గమనించిన తాను ఇక ఈ వాతావరణంలో విమానం నడపడం సాధ్యం కాదని భావించి గ్రీన్‌లాండ్‌లోని చిన్న విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు చెప్పారు. ఇక అత్యంత చల్లని ప్రదేశంలో ప్రయాణించినందున ఆయన చెవులు గడ్డకట్టుకుపోయినట్లు తెలిపాడు. ఇక అధిక పీడనంను తట్టుకోవడం కూడా కత్తిమీద సాములాంటిదే అని చెప్పిన జాంగ్‌బో త్వరలో మరో ట్రిప్‌కు సన్నద్ధం అవుతున్నట్లు వెల్లడించాడు.

English summary
A 57-year-old Chinese man has completed his second around the world flight trip after flying for 68 days with 50 stops, a media report said on Monday.Zhang Bo, who kicked off his flight from the Chicago airport on April 2 and flew over 21 countries in three continents and over three oceans, with a total mileage reaching 41,000 kms, landed at the same airport on Sunday morning, the state-run Global Times reported. Before landing, Zhang circled around a small airport four times at low altitude to express his excitement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X