• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సరిహద్దులోనే కాదు... సైబర్ దాడులకూ పాల్పడుతున్న చైనా... ఏకంగా 'శాటిలైట్' వ్యవస్థపై ఎటాక్...

|

సరిహద్దులోనే కాదు టెక్నాలజీ విషయంలోనూ భారత్‌ లక్ష్యంగా చైనా సైబర్ దాడులకు పాల్పడుతోందా..? అంటే అవుననే చెబుతోంది అమెరికా. 2012 నుంచి 2018 వరకు భారత్‌పై చైనా అనేకసార్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు అమెరికా కేంద్రంగా పనిచేసే చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇనిస్టిట్యూట్(CASI) వెల్లడించింది. అంతేకాదు,2017లో భారత శాటిలైట్ వ్యవస్థ లక్ష్యంగా కంప్యూటర్ నెట్‌వర్క్ ఎటాక్ చేసినట్లు సంచలన విషయాన్ని బయటపెట్టింది. అమెరికాలో రక్షణ విభాగానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు,పరిశోధన,వ్యూహాత్మక విశ్లేషణలకు సంబంధించి సీఎఎస్ఐ ప్రభుత్వానికి కీలక సలహాలు,సూచనలు ఇస్తుంటుంది.

సరిహద్దు ఉద్రిక్తతల వేళ... చైనా కంపెనీతో ధోనీ డీల్... ఇదీ ఫ్యాన్స్ రియాక్షన్...

రిపోర్టులో ఏముంది...

రిపోర్టులో ఏముంది...

మొత్తం 142 పేజీల సీఏఎస్ఐ నివేదికలో భారత్‌పై చైనా సైబర్ దాడుల అంశాన్ని పేర్కొన్నారు. అయితే అనేకసార్లు చైనా భారత్‌పై సైబర్ దాడులు చేసినట్లు చెప్పినప్పటికీ.. కేవలం ఒక్క కేసుకు సంబంధించిన వివరాలను మాత్రమే వెల్లడించారు. నిజానికి మన శాటిలైట్ వ్యవస్థపై దాడులను ఎదుర్కొనేందుకు భారత్ కౌంటర్ స్పేస్ టెక్నాలజీని కలిగి ఉంది. యాంటీ-శాటిలైట్ మిస్సైల్ టెక్నాలజీతో శత్రు శాటిలైట్లను ధ్వంసం చేయగలదు. అయితే వీటిని మించిన వ్యవస్థ చైనా వద్ద ఉందని... మల్టిపుల్ కౌంటర్ స్పేస్ టెక్నాలజీలతో జియోసింక్రోనస్ ఆర్బిట్(GEO) వ్యవస్థను సైతం అది టార్గెట్ చేయగలదని సీఏఎస్ఐ తెలిపింది.

శత్రు సైన్యం లక్ష్యంగా పీఎల్ఏ...

శత్రు సైన్యం లక్ష్యంగా పీఎల్ఏ...

కో-ఆర్బిటల్ శాటిలైట్స్,డైరెక్ట్ యాసెంట్ కైనెటిక్-కిల్ వెహికల్(యాంటీ శాటిలైట్ మిస్సైల్స్),జామర్స్,సైబర్ సామర్థ్యాలను దెబ్బతీసే మల్టిపుల్ కౌంటర్ స్పేస్ టెక్నాలజీని చైనా కలిగివున్నట్లు సీఏఎస్ఐ వెల్లడించింది. అంతేకాదు,చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శత్రు సైన్యం లక్ష్యంగా ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అభివృద్ది చేసుకుంటూనే ఉందని చెప్పింది. మార్చి 27,2019న భారత్ యాంటీ శాటిలైట్ మిస్సైల్ ప్రయోగం చేపట్టి విజయవంతమవగా... చైనా 2007లోనే ఆ పని చేసిందని... గ్రౌండ్ స్టేషన్స్‌ను హైజాక్ చేసే కంట్రోల్ స్పేస్‌క్రాఫ్ట్/శాటిలైట్ టెక్నాలజీ డ్రాగన్ వద్దని గతంలో 2019లో కార్నెజి ఎండోమెంట్ ఇంటర్నేషనల్ పీస్ వెల్లడించిన ఓ నివేదికలో పేర్కొనడం గమనార్హం.

ఇస్రో ఏమంటోంది...

ఇస్రో ఏమంటోంది...

తాజా సీఏఎస్ఐ రిపోర్టుపై భారత ఇస్రో అధికారులు మాట్లాడుతూ... కొన్నేళ్లుగా సైబర్ దాడులను గుర్తించలేకపోయినట్లు చెప్పారు. నిజానికి సైబర్ దాడులను పసిగట్టినప్పటికీ... వాటి వెనుక ఎవరున్నారు అన్నది నిర్దారించలేకపోయామన్నారు. అయితే సైబర్ దాడులపై అప్రమత్తం చేసే వ్యవస్థ భారత్‌కు ఉందన్నారు. చైనా బహుశా మనపై సైబర్ దాడులకు యత్నించి విఫలమై ఉండవచ్చునని తెలిపారు. సైబర్ దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

  TikTok, Wechat పై నిషేధం విధించిన US.. వచ్చే ఆదివారం నుంచి డౌన్‌లోడ్‌లు నిలిపివేత!!
  మన శాటిలైట్ వ్యవస్థ సేఫ్...

  మన శాటిలైట్ వ్యవస్థ సేఫ్...

  ఇస్రో చైర్మన్ కె.శివన్ మాట్లాడుతూ... భారత శాటిలైట్ కేంద్రాలపై ఇప్పటికైతే ఎలాంటి సైబర్ దాడుల సమాచారం లేదని ఖండించారు. అయితే సైబర్ దాడుల ముప్పు ఎప్పుడూ ఉంటుందని... అది భారత్‌కే పరమితమైనదేమీ కాదన్నారు. మన వ్యవస్థ చాలా సురక్షితంగా ఉందని చెప్పుకొచ్చారు. మరికొందరు స్పేస్ సైంటిస్టులు మాట్లాడుతూ... స్పేస్ టెక్నాలజీలో ఇండియా ఇండిపెండెంట్&ఐసోలేటెడ్ నెట్‌వర్క్‌ని కలిగి ఉందన్నారు. అది ఇంటర్నెట్ సహా ఏ పబ్లిక్ డొమైన్‌తో కనెక్ట్ అయి లేదని... కాబట్టి మన వ్యవస్థలు సురక్షితమని అభిప్రాయపడ్డారు.

  English summary
  China carried out multiple cyber-attacks between 2007-2018, including a computer network attack against Indian satellite communication in 2017, a news report by US-based China Aerospace Studies Institute (CASI) confirmed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X