వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికానే టార్గెట్-అరగంటే టైమ్: చైనా క్షిపణుల సామర్థ్యం మామూలుగా లేదుగా!

|
Google Oneindia TeluguNews

బీజింగ్: తమ దేశాన్ని ఏ శక్తీ కదిలించలేదని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. చైనా 70వ జాతీయ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలను నిర్వహించింది. అత్యంత ఆధునిక ఆయుధాలను కూడా ప్రదర్శించింది.

చైనా ఎఫెక్ట్ : ఇండియా - అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలు, జీఎస్‌పీపై భారత్ పట్టు

అత్యంత శక్తివంతం

ఆయుధ ప్రదర్శనలో అరగంటలో అమెరికాను చేరుకునే బాలిస్టిక్ క్షిపణి డీఫ్-41ని తొలిసారిగా ప్రదర్శించింది. చైనాకు చెందిన వాహనాలు ఈ క్షిపణులతో తియన్మార్ స్క్వేర్ వద్ద బారులు తీరాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇది అత్యంత శక్తివంతమైన క్షిపణిగా అమెరికాకు చెందిన ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

అరగంటలోనే..

ఈ క్షిపణి 15,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. కేవలం 30 నిమిషాల్లోనే అమెరికా చేరుకుంటుంది. ఒకేసారి 10 వార్‌హెడ్లను తీసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉండటం గమనార్హం. అంతేగాక, ఈ క్షిపణి అమెరికా రక్షణ వ్యవస్థలను తప్పించుకుని ప్రయాణించగలగడం మరో విశేషం. దీన్ని ఏడో తరం క్షిపణిగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.

శబ్ధ వేగం కంటే..

శబ్ధ వేగానికి దాదాపు 25 రేట్ల వేగంతో ప్రయాణించగలదు. ఇప్పటికే చైనా వద్ద 11,200 కి.మీ ప్రయాణించే డాంగ్‌ఫెంగ్ క్షిపణి ఉంది. దక్షిణ చైనా సముద్రంలో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో చైనా ఈ ఆయుధాన్ని ప్రదర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అక్కడ కృత్రిమ దీవుల్లో ఆయుధాలను నిలిపి ఉద్రిక్తతలకు తావిచ్చింది చైనా.

చైనా కదిలించే శక్తి ఎవరికీ లేదు..

స్టెల్త్ డ్రో డీర్-8 డ్రోన్ అమెరికాకు చెందిన గువామ్ ప్రాంతాలను చేరుకోగలదు. నిఘా అవసరాల కోసం ఈ డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. చైనా ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీ కోసం భారీగా పెట్టుబడి పెట్టింది. షార్ప్ స్వర్డ్ అటాకింగ్ డ్రోన్‌ను కూడా చైనా అభివృద్ధి చేసింది. కాగా, ఇటీవలే చైనా 15 తేలికపాటి టైప్ 15 ట్యాంకులను అభివృద్ధి చేసింది. కాగా, తమ దేశాన్ని కదిలించే శక్తి ఎవరికీ లేదంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జాతీయ దినోత్సవం సందర్భంగా స్పష్టం చేశారు. ఈ గొప్ప దేశం పునాదులు కదిలించే శక్తి ఎవరికీ లేదని, చైనా అడ్డుకునే శక్తి ప్రపంచంలోనే లేదని వ్యాఖ్యానించారు.

English summary
President Xi Jinping declared Tuesday that "no force" can shake the Chinese nation as he oversaw a massive military celebration of 70 years of Communist Party rule, shadowed by a day of protest in seething Hong Kong that threatened to steal the spotlight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X