వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వార్డులో నర్సు అనూహ్య చర్య.. నిమిషాల్లో అంతా మారిపోయింది..

|
Google Oneindia TeluguNews

అంతా బాగున్నప్పుడు.. అన్నీ అనుకూలంగా జరిగిపోతున్నప్పుడు.. అందరూ సంతోషంగానే ఉంటారు. కానీ, కష్టాలు ఎదురైనప్పుడు మాత్రం డీలా పడిపోతారు. అంతుచిక్కని మహమ్మారి తరుముకొస్తోందని తెలిస్తే భయభ్రాంతులకు లోనవుతారు. ఇవాళ మనందరిదీ అదే పరిస్థితి. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. బతుకు ప్రశ్నార్థమైనచోట.. సాటి మనిషి ప్రాణాల కోసం తెగింపునకు సిద్ధపడేవాళ్లెవరైనా ఉంటే వాళ్లను గొప్పవాళ్లంటాం. హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, ఢిల్లీ, ఇటలీ, ఇరాన్, అమెరికా, చైనా.. ఇలా ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ఇవాళ మనకా గొప్పవాళ్లు.. డాక్టర్లు, నర్సుల రూపంలో కనిపిస్తారు.

కరోనా ఎఫెక్ట్: ఆఫీసులకు రావొద్దు.. ఉద్యోగులకు కంపెనీల ఆదేశం..కరోనా ఎఫెక్ట్: ఆఫీసులకు రావొద్దు.. ఉద్యోగులకు కంపెనీల ఆదేశం..

తమ ప్రాణాలను పణంగాపెట్టి విపత్తుతో పోరాడుతున్న వైద్య సిబ్బందికి నిజంగా హ్యాట్సాఫ్. కరోనాను మొట్టమొదటిగా గుర్తించి ప్రపంచాన్ని అలర్ట్ చేసి, చివరికి అదే వైరస్ కాటుకు బలైన చైనా డాక్టర్ లీ వెన్‌లియాంగ్‌, ఆయన టీమ్ చరిత్రలో నిలిచిపోతారు. వైరస్ ఎంత ప్రమాదకరమైందైనా ప్రపంచంలో ఏ డాక్టర్ గానీ, నర్సుగానీ కరోనా రోగుల్ని ముట్టుకోబోమని చెప్పలేదు.. చెప్పరు కూడా.. అది వాళ్ల డ్యూటీ అని తేలికగా చెప్పేకంటే.. ప్రస్తుత సందర్భంలో గొప్పతనమనే కొనియాడాలి. ఇంత భయానక వాతావరణంలోనూ భవిష్యత్తుపై ఆశ కోల్పోలేదంటూ చైనాకు చెందిన ఓ నర్సు చేసిన పని అందరినీ ఆకట్టుకోవడమేకాదు, ఆలోచింపజేస్తున్నది కూడా.

China Nurse Wants Government to Assign a Boyfriend to Her When coronavirus is Over

కరోనా విలయం ధాటికి దాదాపు స్మశానంగా తయారైన వూహాన్‌ సిటీలో ఇంకా కొంతమంది డాక్టర్లు, నర్సులు వైరస్ ను జయించేందుకు పోరాటం చేస్తూనే ఉన్నారు. రోగుల సంఖ్య, పని ఒత్తిడి పెరుగుతున్నక్రమంలో.. గుండెధైర్యంగల ఓ యువ నర్సు(పేరు తియాన్ ఫాంగ్ఫాంగ్).. కరోనా వార్డులో నిలబడి.. తనకో బాయ్ ఫ్రెండ్ కావాలంటూ పోస్టర్ పట్టుకున్న దృశ్యాలు ప్రపంచానికి కొత్త సందేశాన్నిస్తున్నాయి.

Recommended Video

Coronavirus In Vijayawada, Suspected Patient Getting Treatment In Vijayawada GGH | Oneindia Telugu

''ప్రస్తుతం నేను కరోనా వార్డులో డ్యూటీ చేస్తున్నాను. నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి. ఆజానుబాహుణ్ని వెతికి పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. బాయ్ ఫ్రెండ్ ని రెడీ చేసి పెడితే.. కరోనా వైరస్ తగ్గిన వెంటనే డేటింగ్ మొదలుపెడతా..''అని చిలిపి కోరిక కోరింది. ఆ మేరకు తన భావాల్ని ప్లకార్డుగా ప్రదర్శిస్తూ ఆమె దిగిన ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. నిమిషాల్లోనే చైనా అంతటా ఫొటోలు షేర్ అయ్యాయి. ఈ నర్సు కారణంగా దాదాపు రెండు నెలల తర్వాత చైనా ఆస్పత్రుల్లో వాతావరణం మారిపోయింది. అందరూ నవ్వడం మొదలుపెట్టారు. మనం కూడా కరోనా కష్టాన్ని నవ్వుతూనే జయిద్దాం.

English summary
in a bizarre demand, a nurse in China asked for a boyfriend in return from the government for helping Wuhan fight the coronavirus outbreak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X