వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో మళ్లీ కరోనా విలయం -బీజింగ్ సహా 15 ప్రధాన నగరాల్లో డెల్టా వేరియంట్ విజృంభణ

|
Google Oneindia TeluguNews

ఇతర దేశాల్లా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండానే కరోనా వైరస్ ను జయించామని గొప్పలు చెప్పుకున్న చైనాలో మళ్లీ మహమ్మారి విలయం మొదలైంది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ విజృంభిస్తుండటంతో డ్రాగన్ దేశం మళ్లీ లాక్ డౌన్ బాట పట్టింది. మేడిన్ చైనా కొవిడ్ వ్యాక్సిన్ల సమర్థతపై అనుమానాలను నిజం చేస్తూ, రెండు టీకా డోసులు తీసుకున్నవారు సైతం భారీగా మళ్లీ వ్యాధి బారిపన పడుతున్నారక్కడ.

Recommended Video

Delta Variant Spreads From Nanjing to Beijing In China | Oneindia Telugu

Rashad Hussain: బైడెన్ అనూహ్యం -మత స్వేచ్ఛ అంబాసిడర్‌ భారతీయ అమెరికన్ -తొలి ముస్లిం కూడాRashad Hussain: బైడెన్ అనూహ్యం -మత స్వేచ్ఛ అంబాసిడర్‌ భారతీయ అమెరికన్ -తొలి ముస్లిం కూడా

2019 చివర్లో చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ గడిచిన ఏడాదిన్నరగా ప్రపంచ దేశాలన్నిటినీ షేక్ చేస్తూ, తీరొక్క వేరియంట్లుగా మ్యూటేట్ కావడం, వాటిలో డెల్టా వేరియంట్ అతి ప్రమాదకరంగా పరిణమించడం తెలిసిందే. ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం ఇప్పటికే 130 దేశాలకు వ్యాపించిన డెల్టా వేరియంట్‌ తాజాగా చైనాను తాకి అక్కడి పరిస్థితిని మార్చేసింది..

 China on high alert as delta variant of Covid 19 spreads to 15 cities incl Beijing

రష్యా నుంచి చైనాలోని నాన్జింగ్‌ నగరానికి వెళ్లిన ఒక విమానం ద్వారా డెల్టా వేరియంట్‌ డ్రాగన్‌ దేశంలోకి అడుగుపెట్టింది. ఆ విమానాన్ని నాన్జింగ్‌ ఎయిర్‌పోర్టులో శుభ్రం చేసిన తొమ్మిది మంది పారిశుధ్య కార్మికులకు ఆ వేరియంట్‌ సోకింది. వారిలో కొందరికి లక్షణాలు కనపడడంతో పరీక్షలు చేయించారు. వారికి డెల్టా వేరియంట్‌ సోకినట్టు జూలై 20న తేలింది. వారి నుంచి వారి కుటుంబసభ్యులు, సన్నిహితులకు.. అలా అలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఈ పదిరోజుల్లోనే చైనాలోని 16 ప్రావిన్సులకు, వాటిలోని కనీసం 26 నగరాలకు విస్తరించింది. ప్రధానంగా బీజింగ్ సహా 15 నగరాల్లో డెల్టా వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉంది.

షాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనంషాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనం

ఒక్క నాన్జింగ్‌ నగరంలోనే గురువారం నాడు కొత్తగా 18 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో నగరంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 200లకు చేరింది. వీటి విస్తృత మరింత ఎక్కువగా ఉండొచ్చని భావించిన అధికారులు నగరాన్ని లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సిటీలోని మొత్తం 90లక్షల మందికీ టెస్టులు చేస్తున్నారు. భారీ స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు చేయడంతో పాటు వ్యాక్సినేషన్‌ను కూడా పెద్దఎత్తున చేపడుతోంది. ఇప్పటికే అక్కడ దాదాపు 150కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు చైనా ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది.

English summary
China is witnessing a sudden surge of the Delta variant of the Covid-19 cases with 15 cities, including capital Beijing, grappling with clusters of positive cases, with the official media on Friday calling it the most extensive domestic contagion after the virus outbreak in Wuhan in December 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X