వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో సినిమా థియేటర్ నిర్మాణం

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం (ఎస్‌సీఎస్)లోని దీవి యాంగ్‌జింగ్‌లో చైనా ఓ సినిమా థియేటర్‌ను ప్రారంభించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం (ఎస్‌సీఎస్)లోని దీవి యాంగ్‌జింగ్‌లో చైనా ఓ సినిమా థియేటర్‌ను ప్రారంభించింది.

సాన్‌షా యిన్లాంగ్ థియేటర్‌లో శనివారం ప్రదర్శించిన 'ది ఎటర్నిటీ ఆఫ్ జియావో యులు' చిత్రాన్ని రెండువందల మంది స్థానికులు , సైనికులు వీక్షించినట్టుగా స్థానిక మీడియా ప్రసారం చేసింది.

China opens cinema theatre in disputed South China Sea island

ఈ దీవిలో కార్యకలాపాలను విస్తృతం చేయడం ద్వారా ఆ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని పెంచుకొనే దిశగా చైనా పావులు కదుపుతోంది. అలాగే భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగా ఎస్‌సిఎస్‌లో కృత్రిమ దీవులను నిర్మించి సైనిక దళాలు దిగేలా ఏర్పాట్లు చేయాలని చైనా చూస్తోంది.

దక్షిణ చైనా సముద్రం వివాదాస్పదంగా ఉంది. దీన్ని చైనా ఆక్రమించుకొనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ సినిమా థియేటర్‌ను నిర్మించడం కూడ ప్రాధాన్యతను సంతరించుకొంది.

English summary
China has opened a modern cinema theatre on Yongxing Island in the disputed South China Sea as part of its plan to establish authority over the area, the state media reported on Sunday. Over 200 residents and soldiers watched the Chinese movie ‘The Eternity of Jiao Yulu’ on Saturday at the Sansha Yinlong Cinema, located in Sansha municipality, China’s newest city in the South China Sea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X