వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో స్టార్ ఫిష్ ఎయిర్‌పోర్టు ప్రారంభం: విమానాశ్రయం ప్రత్యేకతలు ఇవే !

|
Google Oneindia TeluguNews

బీజింగ్ : చైనాలో నూతనంగా నిర్మించిన దక్సింగ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో చైనా 70వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ అతిపెద్ద దక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం విశేషం. ఈ విమానాశ్రయంను చైనా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రారంభించారు.

 దక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం

దక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం

దక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎన్నో ప్రత్యేకతలతో నిర్మితమైంది. దీనికి మొత్తం 11 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. స్టార్ ఫిష్ ఆకారంలో ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. మొత్తం 70వేల చదరపు అడుగుల్లో ఈ విమానాశ్రయం నిర్మాణం జరిగింది. అంటే 98 ఫుట్‌బాల్ మైదానంలు కలిస్తే వచ్చే స్థలంలో దీన్ని నిర్మించినట్లు చైనా మీడియా కథనాలను ప్రసారం చేసింది.

బిజీగా ఉన్న ఎయిర్‌పోర్టులలో రెండో స్థానం

బిజీగా ఉన్న ఎయిర్‌పోర్టులలో రెండో స్థానం

ప్రస్తుతం బీజింగ్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే చాలా బిజీగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌లలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అట్లాంటా విమానాశ్రయం ఉంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా అవుతుండటంతో మరో విమానాశ్రయం నిర్మాణం తప్పనిసరిగా మారింది. దీంతో స్టార్ ఫిష్ విమానాశ్రయం నిర్మాణం వైపు అడుగులు పడ్డాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద టర్మినల్

ప్రపంచంలోనే అతిపెద్ద టర్మినల్

ప్రపంచంలోనే అతిపెద్ద టర్మినల్‌‌ను దక్సింగ్ విమానాశ్రయంలో నిర్మించారు. అదికూడా ఒకే భవంతిలో నిర్మాణం జరగడం ప్రత్యేకత. 2025 నాటికి ఈ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ 175 మిలియన్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ముందుగా ఏడు దేశీయ విమాన సర్వీసులు ఈ నూతన ఎయిర్‌పోర్టు నుంచి సేవలను ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు.ఇప్పటికే డాక్సింగ్ విమానాశ్రయంకు తమ సర్వీసులను నడుపుతామని పలు అంతర్జాతీయ విమానాయాన సంస్థలు ప్రకటించాయి. బ్రిటీష్ ఎయిర్‌వేస్, క్యాథే పసిఫిక్, ఫిన్‌ఎయిర్ వంటి సంస్థలు తమ సర్వీసులను దక్సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంకు నడుపుతామని ప్రకటించాయి.

 విమానాశ్రయంను డిజైన్ చేసిన జాహాహదీద్

విమానాశ్రయంను డిజైన్ చేసిన జాహాహదీద్

చైనాలోని ప్రముఖ తియాన్మెన్ స్క్వేర్‌కు దక్షిణాన 42 కిలోమీటర్ల దూరంలో దక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దీన్ని డిజైన్ చేసింది ప్రముఖ ఆర్కిటెక్ట్ జాహాహదీద్. ఇక ఈ దక్సింగ్ విమానాశ్రయం ప్రారంభంతో ఒకే నగరంలో రెండు అంతకుమించి ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో చేరింది. అంతకుముందు న్యూయార్క్, లండన్ నగరాల్లో మాత్రమే రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండేవి. బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం 1958లో ప్రారంభం కాగా ఇప్పటి వరకు 100 మిలియన్ ప్రయాణికులు దీని ద్వారా లబ్ది పొందారు.

English summary
China President Xi Jinping opened the new Daxing International airport that just looks like a starfish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X