వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే నెలలో ఉత్తరకొరియాకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్..?

|
Google Oneindia TeluguNews

గత కొన్ని నెలలుగా చైనా ఉత్తరకొరియా మధ్య సంబంధాలు బలపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చైనాలో మూడు సార్లు పర్యటించి పలు అంశాలపై ఆదేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరిపారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ఇక సింగపూర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌కు చైనా ఓ ప్రత్యేక విమానంను కూడా అందించింది. ఇంత మంచి బంధం ఉన్నందునే ఈ సారి కిమ్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

ఉత్తరకొరియా ఏర్పడి 70 ఏళ్లు అయినందున వచ్చేనెలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపేందుకు కిమ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ముఖ్య అతిథిగా ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కిమ్ జాంగ్ ఉన్ ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానంపై చైనా విదేశాంగ నుంచి ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు.

China President Jinping to visit North Korea..?

ఒకవేళ జిన్‌పింగ్ ఉత్తరకొరియాకు వెళితే... ఆయన 2012లో అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టాకా ఉత్తరకొరియాలో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. అంతకుముందు మాజీ అధ్యక్షుడు హు జింటావో 2005లో ఉత్తరకొరియాలో పర్యటించారు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత ఓ చైనా అధ్యక్షుడు పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది.

ఉత్తరకొరియా ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు సెప్టెంబర్ 9న ప్రారంభమవుతాయి. అయితే జిన్‌పింగ్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు కాబట్టి ఏక్షణమైనా ఈ షెడ్యూల్‌లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తరకొరియాకు ప్రధాన వాణిజ్య మిత్రదేశంగా చైనా ఉంది. ఇప్పటికే కిమ్ జాంగ్ ఉన్న చైనాలో మూడుసార్లు పర్యటించారు.

ఆ సమయంలో ఇరుదేశాల మధ్య పలు అంశాలపై ఇరునేతలు చర్చించారు. ఆర్థిక అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించారు. మరోవైపు ఉత్తరకొరియా అణుపరీక్షలు పూర్తిగా వదిలేయాలని కోరుతూ అగ్రరాజ్యం అమెరికా కిమ్ దేశంపై ఆంక్షలు విధించింది. ఉత్తరకొరియాకు చైనా ఆల్కహాల్, సిగరెట్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుండటంతో ఆ చైనా కంపెనీలపై కూడా ఆంక్షలు విధించింది అమెరికా.

English summary
Chinese President Xi Jinping is set to visit Pyongyang next month at the invitation of North Korea leader Kim Jong Un to attend the celebrations of the 70th anniversary of North Korea's founding.It will be the Chinese leader's first visit to the North Korean capital since he took power in 2012, and 13 years after the last visit by a Chinese President, when Xi's predecessor Hu Jintao visited in 2005.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X