వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగుళం కూడ వదలం, అలా చేస్తే యుద్దమే, తలొగ్గేది లేదు: జిన్‌పింగ్ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్:తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు ఎలాంటి చర్యలకైనా తాము సిద్దంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. అవసరమైతే యుద్దానికి కూడ సిద్దమేనని ఆయన సంచలన ప్రకటన చేశారు. చైనా దేశాధ్యక్షుడిగా జిని్‌పింగ్ రెండోసారి ఇటీవలే ఎన్నికయ్యారు .

రెండోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జిన్‌పింగ్ పార్లమెంట్‌ను ఉద్దేశించి మంగళవారం నాడు ప్రసంగించారు. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌కు జీవిత కాలం పాటు అధ్యక్ష పదవిలో ఉండే హక్కును కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

ఈ తరుణంలో మంగళవారం నాడు పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా జిన్‌పింగ్ ప్రసంగం కీలకంగా మారింది. రానున్న రోజుల్లో తమ దేశం అనుసరించే వ్యూహన్ని పరోక్షంగా జిన్‌పింగ్ బయటపెట్టారు.

యుద్దానికి కూడ సిద్దమే

యుద్దానికి కూడ సిద్దమే

తమ దేశ సార్వభౌమత్వాన్నికాపాడుకొనేందుకు ఎలాంటి చర్యలకైనా సిద్దంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. అవసరమైతే యుద్దానికి కూడ వెనుకాడబోమని కూడ ఆయన ప్రకటించారు.సరిహద్దు దేశాలకు జిన్‌పింగ్ పరోక్షంగా తమ దేశ వైఖరిని ప్రకటించారు.చైనా నుంచి అంగుళం భూమి కూడా వదులుకోవద్దు. ఇది చైనా దేశం, ప్రజల బలమైన విశ్వాసం. మా దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జిన్ పింగ్.

చైనాను విడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే దేనికైనా సిద్దమే

చైనాను విడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే దేనికైనా సిద్దమే

చైనాను విడగొట్టేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే దేనికైనా తాము సిద్దంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచదేశాల్లో తమ స్థానాన్ని తిరిగి పొందడానికి ఎంతకైనా తెగిస్తామని జిన్‌పింగ్ ప్రకటించారు.

అప్రమత్తంగా ఉండాల్సిందేనా

అప్రమత్తంగా ఉండాల్సిందేనా

చైనాకు సరిహద్దులో ఉన్న దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చైనాకు సరిహద్దులో ఉన్న దేశాలతో సరిహద్దు సమస్యలు ఉన్న దేశాలు వాటిని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. చైనా, భారత్ మధ్య సరిహద్దు వివాదాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు తమ భూభాగంలోనివేనని కొంత కాలంగా చైనా వాదిస్తోంది. తూర్పు , దక్షిణ చైనా సముద్రాలపై కూడ ఆ దేశం ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తోంది.

ఇండియా, చైనా మధ్య వివాదాలు

ఇండియా, చైనా మధ్య వివాదాలు


ఇండియా, చైనా మధ్య ఇటీవల కాలంలో వివాదాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యంగా డోక్లామ్ వద్ద రెండు దేశాలకు చెందిన సైనికులు సుమారు మూడు మాసాలకు పైగా గొడవలకు దిగారు. అయితే రెండు దేశాలు ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకొన్నాయి. అయితే డోక్లామ్‌కు సమీపంలో చైనా ఆర్మీ స్థావరం కోసం ఏర్పాట్లు చేసుకొంటుంది. అంతేకాదు ఇండియాకు సరిహద్దు ప్రాంతాల్లో చైనా ఆర్మీ త్వరగా చేరుకొనేలా రవాణా మార్గాలను ఏర్పాటు చేసుకొంటుంది. ఈ విషయాలపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

English summary
Xi Jinping has said China will never allow “one inch” of territory to be separated from it in a strongly nationalistic speech.The Chinese president was making a closing address to the National People’s Congress,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X