వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రావత్ వ్యాఖ్యలపై చైనా ఉలిక్కిపాటు, ఆగ్రహం: డొక్లాం వివాదం ముగిసిందా? ఏమిటీ సలామీ స్లైసింగ్?

డొక్లామ్ వ్యవహారం నేపథ్యంలో, భార‌త్ ఓపిక‌ను బీజింగ్ (చైనా) పరీక్షిస్తోందని ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌పై చైనా విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

రావత్ వ్యాఖ్యలపై చైనా ఉలిక్కిపాటు, ఆగ్రహం: డొక్లాం వివాదం ముగిసిందా?

బీజింగ్: డొక్లామ్ వ్యవహారం నేపథ్యంలో, భార‌త్ ఓపిక‌ను బీజింగ్ (చైనా) పరీక్షిస్తోందని ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌పై చైనా విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.

చదవండి: డొక్లామ్, బ్రిక్స్ ఎఫెక్ట్: భారత్ ముందు పనిచేయని చైనా వ్యూహం

బ్రిక్స్ స‌మావేశాల్లో జీ జిన్ పింగ్‌, నరేంద్ర మోడీ భేటీలో చ‌ర్చించుకున్న‌ దానికి విరుద్ధంగా రావత్ వ్యాఖ్య‌లు చేశార‌ని మండిప‌డింది. ఢిల్లీలోని సెంట‌ర్ ఫ‌ర్ ల్యాండ్ వార్‌ఫేర్ స్ట‌డీస్ వారు నిర్వ‌హించిన సెమినార్‌లో బిపిన్ మాట్లాడిన విషయం తెలిసిందే.

చదవండి: ఉత్తర కొరియా ఎపెక్ట్: చైనా సైంటిస్ట్‌ల పరిశోధనలో షాకింగ్, కిమ్‌కు చెక్

ఇవీ రావత్ చేసిన వ్యాఖ్యలు

ఇవీ రావత్ చేసిన వ్యాఖ్యలు

`భార‌త్ యుద్ధానికి సిద్ధం కావాలి. యుద్ధం విష‌యంలో చైనా ఇప్ప‌టికే సిద్ధ‌మైంది' అని వ్యాఖ్య‌ానించారు. పాకిస్థాన్‌తో కూడా రాజీ కుదిరే అవకాశం కన్పించడం లేదన్నారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్దంగా ఆర్మీ ఉందన్నారు బిపిన్ రావత్.

ఆయనకు హక్కు ఉందో లేదో తెలియదు

ఆయనకు హక్కు ఉందో లేదో తెలియదు

దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి జెంగ్ షువాంగ్ స్పందించారు. 'భార‌త మీడియా ప్రసారం చేసిన విష‌యాల మేర‌కు స‌రిహ‌ద్దు వివాదాల గురించి మాట్లాడే హ‌క్కు ఆయ‌న‌కు (బిపిన్‌) ఉందో లేదో మాకు తెలియ‌దు.' అని పేర్కొన్నారు.

మోడీ-జిన్ పింగ్ మాట్లాడుకున్నారు.. అది తెలుసుకోవాలని

మోడీ-జిన్ పింగ్ మాట్లాడుకున్నారు.. అది తెలుసుకోవాలని

కానీ రెండ్రోజుల క్రిత‌మే ఇరు దేశాల అధినేత‌లు అన్ని విష‌యాల్లోనూ క‌లిసి క‌ట్టుగా ఉండాల‌ని నిర్ణయించుకున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి షువాంగ్ అన్నారు. స‌రిహ‌ద్దు వివాదాల విష‌యం ప‌క్క‌న పెట్టి అభివృద్ధి దిశ‌గా అడుగులు వేయాల‌ని వారు నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాల‌ను స‌ద‌రు మిల‌ట‌రీ అధినేత దృష్టిలో ఉంచుకుంటార‌ని భావిస్తున్నానని చెప్పారు.

తెలియకుండా చేశారా

తెలియకుండా చేశారా

ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు సరికాదని చైనా పేర్కొంది. భారత్‌కు చెందిన వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యపరిచిందన్నారు. రావత్‍‌కు అధికారం ఉందా లేదంటే అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు అనుకోవాలా అని ప్రశ్నించారు.

బెదిరింపులు వద్దనే

బెదిరింపులు వద్దనే

జిన్‌పింగ్‌, మోడీ సమావేశమైనపుడు బెదిరింపులకు పాల్పడకూడదనే విషయాన్ని నొక్కి చెప్పారని చైనా పేర్కొంది. హేతుబద్ధమైన మార్గంలో చైనా అభివృద్ధిని భారత్‌ వీక్షిస్తుందని మేము ఆశిస్తున్నామని, ప్రత్యర్థులను బెదిరించాలనుకోవడం లేదని, సరిహద్దుల వద్ద శాంతిని నెలకొనేలా చేసేందుకు ఇరు దేశాల మధ్య సహకారం ఎంతగానో అవసరమని, ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఇరువైపుల సైన్యాలు సహకరిస్తాయని ఆశిస్తున్నామన్నారు.

డొక్లాం వివాదం ముగిసిందా?

డొక్లాం వివాదం ముగిసిందా?

డొక్లాం ఒప్పంద ప్రకటన రోజు నుంచి చైనా వైఖరి అనుమానాస్పదంగానే ఉంది. కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా వైఖరి చూస్తుంటే ఈ వివాదం అసలు ముగిసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు.

దాడి చేయమని రావత్ చెప్పలేదు, చైనా ఎందుకు స్పందించింది

దాడి చేయమని రావత్ చెప్పలేదు, చైనా ఎందుకు స్పందించింది

ఎవరి మీదా భారత్‌ ముందుగా దాడి చేయాలని నిన్న రావత్‌ చెప్పలేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాల్సిందే అని చెప్పే క్రమంలో ప్రత్యర్థుల వ్యూహాలు ఎలా ఉంటాయో వివరించారు. నిజానికి చైనాకు అటువంటి ఉద్దేశం లేకపోతే స్పందించాల్సిన అవసరం లేదు.

సలామీ స్లైసింగ్ అంటే?

సలామీ స్లైసింగ్ అంటే?

చైనా దీర్ఘకాలిక వ్యూహాల్లో డొక్లాంకు చాలా ప్రాధాన్యం ఉంది. దీనిలో భాగంగా సలామీ స్లైసింగ్‌ వ్యూహాన్ని అనుసరించవచ్చు. దీనికోసం ప్రత్యేర్థి దేశాలపై గుట్టుచప్పుడు కాకుండా చిన్నచిన్న రహస్య సైనిక చర్యలు చేపడుతుంది. ఈ ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇతర దేశాలకు చెందిన చాలా భూభాగాన్ని చైనాలో కలిపేసుకుంటుంది. ఇటువంటి దాడులకు ప్రత్యర్థి దేశాలు ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చైనాకు భూభాగాన్ని సమకూర్చడంతోపాటు.. ఆయా ప్రదేశాలు వివాదాస్పద ప్రాంతాలుగా అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తాయి.

ఆక్సాయ్ చిన్ అలాగే

ఆక్సాయ్ చిన్ అలాగే

జమ్ము కాశ్మీర్‌లో ఆక్సాయ్‌చిన్‌ను చైనా ఆక్రమించిన తీరు సలామీ స్లైసింగ్‌కు మంచి ఉదాహరణ. ఆ తర్వాత కూడా అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం తదితర ప్రాంతాల్లో చిన్నచిన్న ఆక్రమణలకు పాల్పడింది. 1974లో వియత్నాం నుంచి పారాసెల్‌ దీవులను ఇదే విధంగా సొంతం చేసుకుంది. తర్వాత 1988లో జాన్సన్‌ రీఫ్‌ను, 1995లో మరోమారు ఫిలిప్పీన్స్‌, వియత్నాం నుంచి భూభాగాన్ని ఆక్రమించింది. ఇప్పుడు వియత్నాం ఎకనామిక్‌ జోన్‌లో చమురు బావుల పేరుతో ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. యుద్ధాలను రాకుండా చూసుకుంటూ అవకాశం దొరికినప్పుడు ఆక్రమించడమే సలామీ స్లైసింగ్‌ లక్ష్యం.

డొక్లాంపై వ్యూహాత్మకంగా

డొక్లాంపై వ్యూహాత్మకంగా

డొక్లాంలో ఉన్న యథాతథ పరిస్థితిని చైనా నెమ్మదిగా తనకు అనుకూలంగా మార్చుకొని ఆక్రమణలను ప్రారంభిస్తుందని అమెరికాకు చెందిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిని చూసి పొరుగుదేశాలు కూడా మొదలుపెడతాయి. దక్షిణ చైనా సముద్రం విషయంలో ఇదే జరిగింది.

English summary
China's foreign ministry reacted sharply to Indian Army chief Bipin Rawat's comment that China is 'salami slicing' its way into Indian territory gradually, with the official spokesperson asking whether the general had spoken out of turn here on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X