వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోస్త్ మేరా దోస్త్: కిమ్‌ జాంగ్ ఉన్‌కు కరోనా వ్యాక్సిన్... ఇచ్చిందెవరో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ప్యాంగ్యాంగ్ : ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి పలు దేశాలు అతలాకుతలం అయ్యాయి. ఇక ఉత్తరకొరియా దేశంలో అయితే కరోనావైరస్ పాజిటివ్ కేసులు కనిపించలేదు. ఒక కేసు రావడంతో నియంత కిమ్ జాంగ్ ఉన్ వారిని హతమార్చారనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఉత్తరకొరియాతో ముడిపడిఉన్న కరోనావైరస్‌కు సంబంధించి ఒక అప్‌డేట్ వచ్చింది.

Recommended Video

Covid-19 Vaccine : North Korea కు Vaccine ఇచ్చి ఆదుకున్న China

ఉత్తరకొరియాకు మంచి మిత్రదేశంగా ఉన్న చైనా... కిమ్ జాంగ్ ఉన్‌కు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రమంలో ఉత్తరకొరియాకు వ్యాక్సిన్‌ను ఇచ్చి ఆదుకునేందుకు చైనా ముందుడుగు వేసింది. చైనాలో తయారైన వ్యాక్సిన్‌ను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు అతని కుటుంబ సభ్యులకు చైనా ఇచ్చింది. ఈ విషయాన్ని ఉత్తరకొరియా అంశాలకు సంబంధించిన అమెరికా అనలిస్టు ఒకరు బహిర్గతం చేశారు.

China provides Covid Vaccine to North Korean President Kim Jong Un and his family members

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అతని కుటుంబ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులకు చైనా వ్యాక్సిన్ ఇచ్చిందని నార్త్ కొరియా అంతర్గత విషయాలపై అవగాహన ఉన్న అమెరికా దేశీయుడైన హ్యారీ కాజియాన్సిస్ వెల్లడించారు.అయితే ఈ వ్యాక్సిన్‌ను ఏ ఔషధ సంస్థ అందజేసిందనే విషయం పై స్పష్టత లేదని చెప్పారు. అంతేకాదు ఈ వ్యాక్సిన్ సురక్షితమా కాదా అన్న అంశంపై కూడా క్లారిటీ లేదని చెప్పారు. అయితే ఈ వ్యాక్సిన్‌లు మాత్రం సప్లయ్ చేసేందుకు చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. మొత్తం మూడు ఔషధ కంపెనీలు కరోనావైరస్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయని చెప్పారు. ఇందులో సినోవాక్ బయోటెక్ లిమిటెడ్, కాన్‌సైనోబయో, సినోఫ్రమ్ గ్రూప్‌ సంస్థలు వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి.

సినోఫ్రమ్ నుంచి వచ్చిన వ్యాక్సిన్‌ ఇప్పటికే 10 లక్షల మంది చైనీయులకు ఇవ్వగా.. అయితే మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసినట్లు ఏ కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ప్రయోగంలో భాగంగానే కిమ్‌కు వ్యాక్సిన్ ఇచ్చి ఉండొచ్చనే అభిప్రాయాన్ని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే చైనాలో తయారైన వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర లభించినప్పటికీ... ఏ వ్యాక్సిన్‌ కచ్చితత్వంతో లేదు కాబట్టి కిమ్ జాంగ్ ఉన్ ఆ రిస్క్ తీసుకోరనే తాను భావిస్తున్నట్లు 2012లో ఉత్తరకొరియా నుంచి దక్షిణ కొరియాకు చొరబడిని ఇన్‌ఫెక్షియస్ డిజీస్ నిపుణులు చోయ్ జంగ్ హున్ చెప్పారు. ఇదిలా ఉంటే కిమ్ జాంగ్ ఉన్ రిస్క్ తీసుకున్నారని అయితే అది చైనా నుంచి వచ్చిన వ్యాక్సిన్ కాబట్టి దానిపై తను సంతృప్తి వ్యక్తం చేసి ఉంటాడని మార్క్ బ్యారీ అనే మరో విశ్లేషకులు ట్వీట్ చేశారు.

English summary
News is making rounds that China had provided the Covid-19 Vaccine to North Korean President Kim Jong Un and his family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X