వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రుడి వెనుకవైపు తొలి ఫోటో ఇది: చరిత్ర సృష్టించిన చైనా, ఫోటోలు విడుదల

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాకు చెందిన లూనార్ రోవర్ చంద్రుడి వెనుక భాగంలో విజయవంతంగా దిగింది. ఇందుకు సంబంధించిన చైనీస్ స్టేట్ మీడియా గురువారం విడుదల చేసింది. ఈ ఫోటోలను చైనా స్పెస్ ఏజెన్సీ షేర్ చేసింది. చంద్రుడి వెనుక భాగంలో దిగడం చారిత్రాత్మకం.

చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) చాంగే-ఇ4ను గత ఏడాది డిసెంబర్ 8న ప్రయోగించింది. చంద్రుడి వెనుక వైపు దిగిన తొలి వ్యోమనౌకగా ఇది చరిత్ర సృష్టించింది. డిసెంబర్ 8న ప్రయోగించిన ఆ నౌక గురువారం (జనవరి 3) దిగింది.

 ఫోటోలు తీసి పంపిన రోవర్

ఫోటోలు తీసి పంపిన రోవర్

చాంగే-ఇ4 చంద్రుడి మీద దిగి ఫోటోలు పంపించినట్లు చైనీస్ స్టేట్ మీడియా తెలిపింది. ఇందులో ల్యాండర్, రోవర్ ఉన్నట్లు తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం గం.10.26 నిమిషాలకు చంద్రుడిపై నిర్దేశిత ప్రాంతంలో దిగింది. వ్యోమనౌకను లాంగ్ మార్చ్ 3బీ రాకెట్ ద్వారా పంపించారు. చంద్రుడి వెనుక భాగంలో దిగిన రోవర్ దానిలోని ఓ మానిటర్ కెమెరా నుంచి అది దిగిన ప్రదేశాన్ని ఫోటో తీసింది.

 చంద్రుడి వెనుక వైపున తొలి ఫోటో

చంద్రుడి వెనుక వైపున తొలి ఫోటో

చంద్రుడి వెనుక వైపున తొలి ఫోటో ఇది. భూమికి ఎదురుగా ఉండే చంద్రుడి భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. వెనుక భాగం కనిపించదు. భూమి ఎలాగైతే గుండ్రంగా తిరుగుతుందో, చంద్రుడు కూడా తిరుగుతాడు. చంద్రుడు ఎప్పుడూ ఒకేవైపు కనిపిస్తాడు. ఇప్పటి వరకు ఇక్కడి ప్రాంతంలో ఏ వ్యోమనౌక సురక్షితంగా దిగలేదు. అందువల్ల పరిశోధనలు సాధ్యం కాలేదు. ఇప్పుడు చైనా వ్యోమనౌక దిగింది.

 ఇదో మైల్ స్టోన్

ఇదో మైల్ స్టోన్

దీనిపై లూనార్ మిషన్ చీఫ్ డిజైనర్ వు వీరెన్ మాట్లాడుతూ... బలమైన స్పేస్ నేషన్ వైపుగా చైనా అడుగులు వేస్తోందని తెలిపారు. బలమైన స్పేషన్ నేషన్ నిర్మాణంలో ఇదో మైల్ స్టోన్ అని చెప్పారు.

English summary
In an historic first, China has successfully landed a rover on the far side of the moon, Chinese state media announced Thursday, a huge milestone for the nation as it attempts to position itself as a leading space power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X