• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా మరో దుస్సాహసం: జీ7 దేశాలతో ఢీ: హాంకాంగ్‌పై భద్రతా చట్టం ప్రయోగించి తీరుతామంటోన్న డ్రాగన్

|

బీజింగ్: భారత్‌తో సరిహద్దు వివాదాన్ని హింసాత్మకంగా మార్చేసిన డ్రాగన్ కంట్రీ చైనా.. మరో దుస్సాహసానికి పాల్పడింది. ఈ సారి ఏకంగా జీ7 శిఖరాగ్ర దేశాలతో ఢీ అంటే ఢీ అంటోంది. అత్యంత బలోపేతమైన జీ7 దేశాలతోనూ కయ్యానికి కాలు దువ్వుతోంది. హాంకాంగ్‌పై అమలు చేయదలిచిన తమదేశ జాతీయ భద్రతా చట్టం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో అమెరికా సహా జీ7 దేశాలు చేసిన విజ్ఙప్తిని చైనా నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది.

పాక్, చైనా ఓటు కూడా భారత్‌కే: ఐరాస భద్రతామండలి ఎన్నికల్లో ఘనవిజయం..సభ్యత్వం: ఏడాది

 హంకాంగ్‌పై చైనా జాతీయ చట్టాన్ని ప్రయోగించొద్దు..

హంకాంగ్‌పై చైనా జాతీయ చట్టాన్ని ప్రయోగించొద్దు..

జీ7 దేశాలు చేసిన విజ్ఙప్తిని తాము పరిశీలనలోకి తీసుకోలేమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి యాంగ్ జీచీ స్పష్టం చేశారు. హాంకాంగ్‌లో తమ దేశ జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయడానికి ఇప్పటికే చైనా సన్నాహాలు చేస్తోంది. ఫలితంగా- హాంకాంగ్ చైనాలో అంతర్భాగమౌతుంది. దీన్ని వ్యతిరేకిస్తున్నారు హాంకాంగ్ ప్రజలు. దీనిపై ఇప్పటికే భారీ ఎత్తున నిరసనలు సైతం అక్కడ చెలరేగాయి. అయినప్పటికీ చైనా వెనక్కి తగ్గలేదు. తాజాగా ఈ విషయంలో జీ7 దేశాలు జోక్యం చేసుకున్నాయి.

హాంకాంగ్ ప్రాథమిక చట్టం ఉల్లంఘనగా..

హాంకాంగ్ ప్రాథమిక చట్టం ఉల్లంఘనగా..

హంకాంగ్‌పై అత్యంత కఠిన చైనా చట్టాలను అమలు చేసే విషయాన్ని పునరాలోచించాలంటూ జీ7 దేశాలకు చెందిన విదేశాంగ శాఖ కార్యదర్శులు చైనాకు విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు జీ7 కూటమిలో సభ్యత్వం ఉన్న అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యుకే ప్రతినిధులు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. చైనా జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయడం వల్ల హాంకాంగ్‌ ఇప్పటి వరకు అనుభవించిన ప్రాథమిక చట్టం నిబంధనలను ఉల్లంఘించినట్టవుతుందని పేర్కొన్నాయి.

తోసిపుచ్చిన చైనా

తోసిపుచ్చిన చైనా

జీ7 దేశాలు చేసిన ఈ ప్రతిపాదనలను తాము పరిగణనలోకి తీసుకోలేమని చైనా తేల్చేసింది. ఈ ప్రతిపాదనలు తమ దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా భావిస్తున్నామని యాంగ్ జీచీ చెప్పారు. హాంకాంగ్ విషయంలో జీ7 దేశాలు చేసిన తీర్మానాన్ని, ప్రతిపాదనలను తాము తోసిపుచ్చుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ అంశం తమ దేశ అంతర్గత విషయమని, ఇందులో మరెవరి జోక్యాన్ని తాము కోరదలచుకోలేదని పేర్కొన్నారు. సామరస్యంగా, ఏకాభిప్రాయంతోనే తాము హాంకాంగ్‌లో జాతీయ భద్రతాచట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

  #IndiaChinaFaceOff : Modi Called All-Party Meeting For Crucial Step
  ఒక దేశం.. రెండు వ్యవస్థలు..

  ఒక దేశం.. రెండు వ్యవస్థలు..

  1984లో హాాంకాంగ్‌ బ్రిటన్ వశమైంది. 99 సంవత్సరాల లీజు అనంతరం మళ్లీ చైనాలో విలీనం చేయాల్సి ఉంటుందనే ఒప్పందాలకు అనుగుణంగా 1997 జులై1న హాంకాంగ్‌ చైనాలో తిరిగి విలీనమైంది. ఆ సందర్భంగా హాంకాంగ్‌ బేసిక్‌ లా ను గుర్తిస్తూ దానికి ప్రత్యేక పాలనా ప్రాంత హోదాను కల్పించింది చైనా. ఒక దేశం రెండు వ్యవస్థలు సిద్ధాంతాన్ని హాంకాంగ్‌కూ వర్తింప జేసింది. ఒక దేశం రెండు వ్యవస్థలు అనే సిద్ధాంతం సరికాదంటూ తాజాగా జీ7 దేశాలు వాదిస్తున్నాయి. దీనివల్ల హాంకాంగ్ ప్రాథమిక చట్టాన్ని తుంగలోకి తొక్కినట్టవుతుందనేది జీ7 దేశాల వాదన.

  హాంకాంగ్ ప్రజల మనోభావాలను గౌరవించాలంటూ..

  హాంకాంగ్ ప్రజల మనోభావాలను గౌరవించాలంటూ..

  చైనా జతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయకూడదంటూ హాంకాంగ్ ప్రజలు పెద్ ఎత్తున నిరసనలను వ్యక్తం చేస్తున్నారని, వారి మనోభావాలను గౌరవించాలని జీ7 దేశాలు సూచిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజలు చైనా జాతీయ చట్టాన్ని అమలు చేయకూడదని కోరుకుంటున్నారని, వారి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటున్నాయి. ఈ మేరకు జీ7 దేశాలు ఓ ఉమ్మడి తీర్మానాన్ని ప్రతిపాదించగా.. దాన్ని చైనా తోసిపుచ్చింది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననేది తేలాల్సి ఉంది.

  English summary
  China said on Thursday it "resolutely opposed" comments from G7 foreign ministers urging it to reconsider its proposed Hong Kong national security law. Senior Chinese official Yang Jiechi said Beijing "resolutely opposes the statement made by the G7 foreign ministers on Hong Kong-related issues".
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X