వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా హై రిస్క్ ఉంటే డైపర్లు వాడాలని చైనా సూచన..అయితే వారికి మాత్రమే!!

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి కారణంగా ఏవియేషన్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే ఇటీవల వివిధ దేశాలలో లాక్ డౌన్ ముగించిన నేపథ్యంలో విమాన సర్వీసులను మొదలుపెట్టారు. ఈ క్రమంలో చైనా ఏవియేషన్ రెగ్యులేటరీ ఫ్లైట్ సిబ్బంది రక్షణ దృష్ట్యా కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వులలో బాగా హైరిస్క్ ఉన్న ఫ్లైట్ లలో సిబ్బంది డైపర్ లను ధరించాలని , టాయిలెట్ లను వినియోగించవద్దని పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.

క్యాబిన్ సిబ్బందికి డైపర్లు ధరించాలని సూచించిన చైనా ఏవియేషన్

క్యాబిన్ సిబ్బందికి డైపర్లు ధరించాలని సూచించిన చైనా ఏవియేషన్

చైనా యొక్క ఏవియేషన్ రెగ్యులేటర్ అధిక ప్రమాదంలో ఉన్న కోవిడ్ -19 ఉన్న దేశాలకు వెళ్లే సమయంలో చార్టర్ విమానాలలో క్యాబిన్ సిబ్బందిని డైపర్లను ధరించాలని సూచిస్తుంది. కరోనా వైరస్ సోకే ప్రమాదాన్ని తగ్గించడానికి బాత్రూమ్స్ ఉపయోగించకుండా ఉంటే మంచిదని మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి విమానయాన సంస్థల మార్గదర్శకాల యొక్క 38 పేజీల జాబితాలో ఈ సూచన చేసింది.

కరోనా కారణంగా చాలాకాలం పాటు నిలిచిన విమాన సర్వీసులు

కరోనా కారణంగా చాలాకాలం పాటు నిలిచిన విమాన సర్వీసులు

కరోనా సంక్షోభం కొనసాగుతున్నా విమాన ప్రయాణాలు కొనసాగించవచ్చు అని ఎయిర్లైన్స్ తొలి నుంచి చెబుతూనే ఉంది. ఆన్లైన్ లో ఎయిర్ ఫిల్టర్ లకు ఆసుపత్రిలోని పరికరాలతో సరితూగే సామర్ధ్యం ఉంటుందని, దీనివల్ల కరోన రిస్కు తక్కువగా ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఫ్లైట్ లలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి జరిగిన నేపథ్యంలో భయాందోళనకు గురై చాలా విమానయాన సంస్థలు, తమ విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి .

సిబ్బందికి కరోనా జాగ్రత్తలపై చైనా ఏవియేషన్ కీలక సిఫార్సులు

సిబ్బందికి కరోనా జాగ్రత్తలపై చైనా ఏవియేషన్ కీలక సిఫార్సులు

ఇక తాజాగా విమాన సర్వీసులను మెల్లమెల్లగా మొదలుపెట్టిన క్రమంలో చైనా యొక్క సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలు మరియు ప్రాంతాలకు మరియు వెళ్ళే చార్టర్ విమానాల సిబ్బందికి కీలక సిఫార్సులను చేసింది. రక్షణ మాస్క్ లను ధరించాలని, చేతికి గ్లౌజులు ధరించాలని, కళ్లకు అద్దాలు పెట్టుకోవాలని, పీపీఈ కిట్లు , షూ కవర్లు ధరించాలని పేర్కొంది. అయితే హైరిస్క్ ఉన్న ఫ్లైట్ లు, చార్టర్ విమానాలలో సిబ్బంది కచ్చితంగా డైపర్లు ధరించాలని పేర్కొంది.

English summary
China's aviation regulator is recommending cabin crew on charter flights to high-risk Covid-19 destinations wear disposable diapers and avoid using the bathroom to reduce the risk of infection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X