వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ విషయంలో మొండిగా వెళ్తే అంతే: చైనాకు ఆ దేశ స్కాలర్ హెచ్చరిక?

చైనా వైఖరిపై ఆ దేశ మేదావుల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం ఆ దేశ వైఖరిని స్పష్టం చేస్తోంది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: భూటన్ ట్రై జంక్షన్‌లో చైనా-భారత్ వివాదం రక్తి కడుతూనే ఉంది. సరిహద్దు వివాదం కాస్త ఇరు దేశాల మీడియా మధ్య వాదోపవాదనలకు తెరలేపింది. మొత్తంగా ఈ విషయంలో సంయమనం కన్నా ఇరుపక్షాల నుంచి దూకుడైన వైఖరే వెల్లడవుతోంది.

డోక్లామ్‌లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినాడోక్లామ్‌లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినా

దీనికి కొనసాగింపుగా చైనా రక్షణశాఖ ప్రతినిధి రెన్‌ గ్యోక్వియాంగ్‌ భారత్‌ను కవ్వించేలా వ్యాఖ్యలు చేయేడం యుద్దంపై మరోసారి చర్చ జరిగేలా చేసింది. అదే సమయంలో చైనా వైఖరిపై ఆ దేశ మేదావుల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం ఆ దేశ వైఖరిని స్పష్టం చేస్తోంది.

చైనా మేదావి ఇలా:

చైనా మేదావి ఇలా:

భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ కోసం చైనా వెంపర్లాడటాన్ని చైనా మేధావి వాంగ్ టవో తవో ఎద్దేవా చేశారు. అరుణాచల్ ప్రదేశ్ కోడి దుమ్ములాంటిదని, అది తినడానికి పనికి రాదు, అలా అని పారేయడానికి కూడా కుదరదని 'ఝిహు.కామ్' అనే చైనీస్ వెబ్‌సైట్‌లో రాసిన వ్యాసంలో ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ వివాదంతో ఇరుదేశాలకు ఒరిగిదేమి లేదని అన్నారు. అరుణాచల్ కోసం చైనా మొండిగా ముందుకెళ్తే.. టిబెటియన్లు కూడా మిగలరని, వేర్పాటువాద శక్తులకు ఊతమిచ్చినట్లేనని చెప్పుకొచ్చారు. ఇదంతా ఓ అర్థం లేని పనే అవుతుందన్నారు.

నిగ్రహం.. చివరి దశకు:

నిగ్రహం.. చివరి దశకు:

'భారత్‌-చైనా-భూటాన్‌ ట్రైజంక్షన్‌ వద్ద చైనా నిర్మిస్తున్న రహదారిని చూసి భారత్ కు భయం పట్టుకుంది. దాని నిర్మాణం పూర్తయితే ఎక్కడ ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు లేకుండా పోతాయోనని ఆందోళన చెందుతోంది. ఈ వివాదంలో తొలి నుంచి చైనా భారత్ తో శాంతిపూర్వక చర్చలనే కోరుకుంటోంది. ఇరు దేశాల మధ్య చర్చల ద్వారా దీనికి పరిష్కారం వెతకాలనుకున్నాం. అయితే సరిహద్దులో చైనా బలగాలు శాంతంగా ఉండాలనే ఇప్పటివరకు నిగ్రహంగా ఉన్నాం.. ఇప్పుడా నిగ్రహం చివరి దశకు చేరుకుంది' అంటూ రేన్ వ్యాఖ్యానించారు.

తక్కువ అంచనా వేయవద్దు:

తక్కువ అంచనా వేయవద్దు:

వివాదాన్ని పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యంతో.. చైనా సైనిక శక్తిని తక్కువగా అంచనా వేయవద్దంటూ రేన్ హెచ్చరించారు. దేశ సౌర్వభౌమత్వం, దేశాభివృద్ధి, భద్రత వంటి విషయాలను సామరస్యంగా పరిష్కరించుకోగలమన్న గట్టి నమ్మకం తమకు ఉందన్నారు.

మా ఓపిక నశిస్తోంది: భారత్‌కు చైనా, నౌకాదళాన్ని శక్తిమంతం చేస్తున్న ఇండియామా ఓపిక నశిస్తోంది: భారత్‌కు చైనా, నౌకాదళాన్ని శక్తిమంతం చేస్తున్న ఇండియా

చైనా ఏకపక్ష నిర్మాణమా?:

చైనా ఏకపక్ష నిర్మాణమా?:

భూటాన్ ట్రై జంక్షన్ లో చైనా ఏకపక్షంగా రోడ్డును నిర్మిస్తోందని, ఈ ప్రాంతంలో యథాతథ పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నిస్తోందని భారతదేశం ఆరోపిస్తోంది. ఈ రోడ్డును నిర్మిస్తే, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళడానికి భారతదేశానికి అవకాశం లేకుండా చేయడమే గాక.. తమ భూభాగంలోకి చై సైన్యం దురాక్రమణకు పాల్పడుతుందన్న ఆందోళనలో భారత్ ఉంది.

English summary
In an unusual move, a Chinese strategic analyst has questioned Beijing's "national obsession" with Arunachal Pradesh, saying that the state is only a "chicken rib" and hardly an "asset" for the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X