• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తమ పౌరులను స్వదేశానికి తీసుకువెళ్లాలని చైనా సంచలన నిర్ణయం ..ఉద్రిక్తతల నేపధ్యమేనా ?

|

ఒకపక్క భారత చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలకు కారణం అవుతున్న చైనా మరోపక్క తమ దేశ పౌరులను ఇండియా నుండి వాపసు తీసుకువెళ్ళేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది . చైనా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆసక్తి కలిగిస్తుంది .ఇక ఇండియాను మరింత అలెర్ట్ చేస్తుంది .

corona update : కరోనా కేసుల్లో టాప్ 10 లో భారత్ .. కొత్త కేసుల నమోదులో 4వ స్థానం

చైనీయులు వెనక్కు రావాలని చైనా రాయబార కార్యాలయం నోటీసు

చైనీయులు వెనక్కు రావాలని చైనా రాయబార కార్యాలయం నోటీసు

చైనా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ,అలాగే కరోనా మహమ్మారి నేపథ్యంలో స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్న విద్యార్థులు, పర్యాటకులు మరియు వ్యాపారవేత్తలతో సహా పౌరులను భారతదేశం నుండి తరలించాలని చైనా సంచలన నిర్ణయం తీసుకుంది . చైనా రాయబార కార్యాలయం సోమవారం తన వెబ్‌సైట్‌లో నోటీసు ఇచ్చి, ప్రత్యేక విమానాలలో టికెట్లు బుక్ చేసుకోవడానికి ఇంటికి తిరిగి రావాలనుకునే వారిని కోరింది. ప్రాణాంతక వైరస్ బారిన పడిన 10 వ దేశంగా భారత్ ఉద్భవించిన నేపథ్యంలో, చైనా తమ పౌరులను తమ దేశానికి తీసుకెళ్ళే పనిలో పడిందనఅంటున్నా అందుకు వేరే కారణాలు కూడా ఉన్నాయి .

ఇండియాలోని చైనీయులను వెనక్కు తీసుకెళ్ళే పనిలో చైనా

ఇండియాలోని చైనీయులను వెనక్కు తీసుకెళ్ళే పనిలో చైనా

కరోనావైరస్ కు చికిత్స పొందినవారు లేదా గత 14 రోజులలో జ్వరం మరియు దగ్గు వంటి లక్షణాలను కలిగి ఉన్నవారిని ప్రత్యేక విమానాలలో తీసుకోరాదని మాండరిన్ నోటీసులో పేర్కొంది.విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు సంబంధిత విభాగాలు , చైనా దౌత్య మరియు కాన్సులర్ మిషన్లు భారతదేశంలోని తమ దేశ విద్యార్థులు, పర్యాటకులు, ఇబ్బందులు ఉన్న తాత్కాలిక వ్యాపార సందర్శకులకు చైనాకు తిరిగి వెళ్ళే అంశంలో సహాయం చేస్తారని అని నోటీసులో పేర్కొంది . చైనాలో విమాన టికెట్ మరియు క్వారంటైన్ ఖర్చును ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు .

 భారత సరిహద్దు ప్రాంతంలో టెన్షన్ నేపధ్యంలో చైనా నిర్ణయంపై ఆసక్తి

భారత సరిహద్దు ప్రాంతంలో టెన్షన్ నేపధ్యంలో చైనా నిర్ణయంపై ఆసక్తి

అంతే కాదు శరీర ఉష్ణోగ్రత బోర్డింగ్‌కు ముందు 37.3 డిగ్రీలు మించి ఉంటే లేదా అనుమానాస్పద లక్షణాలు ఉంటే, మీకు విమానయాన సంస్థ బోర్డింగ్ నిరాకరిస్తుంది అని నోటీసులో పేర్కొంది. భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు కారణం అని చెప్తున్నా తాజా పరిణామాలు ఉద్రిక్తత కలిగిస్తున్నాయి. భారతదేశం నుండి తన పౌరులను ఖాళీ చేయాలన్న చైనా నిర్ణయం కూడా ఇప్పుడు ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణాన్ని మరింత పెంచింది . కరోనావైరస్ మహమ్మారితో ప్రపంచాన్ని అతలాకుతం చేసిన చైనా.. తాజా పరిణామాలతో భారత సరిహద్దు ప్రాంతంలో టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సమయంలోనే తమ దేశ పౌరులను స్వదేశానికి రప్పించటానికి నిర్ణయం తీసుకుంది .

ల‌ఢ‌ఖ్ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా

ల‌ఢ‌ఖ్ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా

ఇటీవ‌ల స‌రిహ‌ద్దు ప్రాంతంలో చైనా ఆర్మీ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ల‌ఢ‌ఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ దాటి భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించి త‌మ ప్రాంత‌మంటూ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది . ఇక ఈ క్రమంలో ఇటీవల భార‌త బ‌ల‌గాల‌తో చైనా సైనికులు తోపులాట‌కు దిగారు. దీంతో స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. తాజాగా ల‌ఢ‌ఖ్ స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర దాదాపు 5 వేల మంది సైనికుల‌ను మోహ‌రించింది చైనా. దౌల‌త్ బెగ్ ఓల్డీ స‌హా పలు ఏరియాల్లో చైనా ఆర్మీ మోహరించారు .

అప్రమత్తం అయిన ఇండియన్ ఆర్మీ .. భారీగా బలగాలు

అప్రమత్తం అయిన ఇండియన్ ఆర్మీ .. భారీగా బలగాలు

ఈ నేప‌థ్యంలో భార‌త ఆర్మీ కూడా అప్ర‌మ‌త్త‌మైంది. స‌రిహ‌ద్దుల్లో చైనా ఆర్మీ మ‌న భూభాగంలోకి రాకుండా అడ్డుకునేందుకు రంగంలోకి దిపింది.భార‌త ఆర్మీ, ఐటీబీపీ బ‌ల‌గాల‌ను ల‌ఢ‌ఖ్ లోని ప‌లు ప్రాంతాల‌కు పంపుతోంది. ఫాన్ గొంగ్ లేక్ స‌హా , గాల్వన్ వ్యాలీ మ‌రికొన్ని కీల‌క ప్రాంతాల‌కు చైనా ఆర్మీ భారీ వాహ‌నాల‌తో త‌ర‌లివ‌స్తున్న‌ట్లు సమాచారం. భార‌త ఆర్మీ 81, 114 బ్రిగేడ్స్ ను వాస్త‌వాధీన రేఖ వెంట మోహ‌రిస్తోంది. స‌రిహ‌ద్దు వెంట త‌ర‌చూ చైనా సైనికుల కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ నేపధ్యంలోనే చైనా తాజా నిర్ణయంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.

English summary
China's decision to evacuate its citizens from India also comes at a time when troops of both the countries are locked in a tense standoff in the disputed areas of Pangong Tso and Galwan Valley along the Line of Actual Control in eastern ladakh for over two weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X