వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా పరువు కాపాడుకుందా అంటే..: డొక్లామ్‌పై చైనా మంత్రి ఇలా

దౌత్యపరంగా డొక్లామ్ సమస్యపై ఎంతో హుందాగా వ్యవహరించిన భారత్‌ను మరోసారి చైనా పదేపదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇరు దేశాల పరస్పర అంగీకారంతో సమస్య పరిష్కారమైంది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: దౌత్యపరంగా డొక్లామ్ సమస్యపై ఎంతో హుందాగా వ్యవహరించిన భారత్‌ను మరోసారి చైనా పదేపదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇరు దేశాల పరస్పర అంగీకారంతో సమస్య పరిష్కారమైంది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలన్నారు.

మేం భారత్‌లోకి చొచ్చుకు వస్తే రచ్చ, చేయడానికేం ఉండదు: చైనా కొత్త బెదిరింపు మేం భారత్‌లోకి చొచ్చుకు వస్తే రచ్చ, చేయడానికేం ఉండదు: చైనా కొత్త బెదిరింపు

కానీ బుధవారం చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యి భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. డొక్లామ్ నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని, ముందుముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సుద్దులు చెప్పారు.

చైనా మంత్రికి మీడియా ప్రశ్న

చైనా మంత్రికి మీడియా ప్రశ్న

సదరు మంత్రి మీడియాతో మాట్లాడుతుండ‌గా ఓ ప్రశ్న ఎదురైంది. డోక్లామ్ నుంచి వెన‌క్కిత‌గ్గి చైనా త‌న ప‌రువు కాపాడుకుందా? అని ప్ర‌శ్నించింది. దీనికి స‌మాధాన‌మిస్తూ.. డోక్లామ్ స‌మ‌స్య భార‌త ఆర్మీ గీత దాట‌డం వ‌ల్ల త‌లెత్తిందన్నారు. ప్ర‌స్తుతం ఆ సమ‌స్య తొల‌గిపోయింద‌ని అన్నారు. మీడియాలో ఎన్నో పుకార్లు వ‌స్తాయ‌న్నారు. తాము అధికారికంగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌నే వాస్త‌వమన్నారు.

భారత్‌తో

భారత్‌తో

తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని చెప్పారు. డోక్లామ్‌పై ఇరు సైన్యాలు తగ్గడంపై మాట్లాడుతూ.. భారతీయులు లేదా చైనా ప్రజల విషయం కాదని, అంతర్జాతీయ ఆకాంక్షలు, చుట్టుపక్కల దేశాల ఆకాంక్షల మేరకు ఉపసంహరణ జరిగిందన్నారు.

డొక్లామ్‌పై భారత్ డేగ కన్ను

డొక్లామ్‌పై భారత్ డేగ కన్ను

డోక్లామ్‌లో చైనా రోడ్డు నిర్మాణం విరమించుకుని వెనుదిరగగా, భారత్ తన సైన్యాన్ని తగ్గించింది. అయితే తమ సైన్యం గస్తీ కొనసాగుతుందని చైనా ప్రకటించింది. భారత్ ఎలాంటి ప్రకటన చేయకుండా సిక్కిం సరిహద్దుల్లోని డోక్లామ్ ఔట్‌ పోస్టుల వద్ద భారత జవాన్లను కాపలా ఉంచింది. చైనా సైన్యం కదలికలపై డేగ కన్ను వేసేందుకు అనువుగా ఎత్తైన ప్రాంతంలో భారత సైనికులు గస్తీ కాస్తున్నారు.

చైనా కదలికలను బట్టి రంగంలోకి భారత్

చైనా కదలికలను బట్టి రంగంలోకి భారత్

'ఇది సిక్కిం-భూటాన్‌-టిబెట్‌ ట్రైజంక్షన్‌‌లోని డోక్లామ్‌కు 500 మీటర్ల దూరం ఉండడం విశేషం. చైనా నుంచి ఎలాంటి కదలికలు కనిపించినా రంగంలోకి దిగేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది. డోక్లామ్‌లో యథాతథ స్థితి కాపాడటమే మన లక్ష్య'మని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వివాదం పరిష్కారం కావడంపై గతంలో చైనా, అమెరికాలో భారత రాయబారిగా పని చేసిన నిరుపమారావు హర్షం వ్యక్తం చేశారు.

English summary
China's Foreign Minister Wang Yi on Wednesday said Beijing hoped India will "learn lessons" from the Doklam standoff and "prevent similar things from happening again", even as he called for a long-term solution to the dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X