వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిబెట్ లో చైనా అసాధారణ చర్య - వాంగ్ యీ ‘రీసెర్చ్’ - డ్రాగన్‌కు షాకిచ్చిన మలేసియా

|
Google Oneindia TeluguNews

ఆక్రమణకు పాల్పడి ఆరు దశాబ్దాలు గడిచినా టిబెట్ పై పూర్తిస్థాయి పట్టు కోసం చైనా ఇప్పటికీ పరితపించే పరిస్థితి. చెప్పినట్లు వినే కీలుబొమ్మ ప్రభుత్వం ద్వారా ఎంత ప్రయత్నించినా టిబెటన్లలో చైనా పట్ల వ్యతిరేకతను తగ్గించలేకపోయారు. ఇండియాతో సరిహద్దు వివాదం ఇంకాస్త ముదిరిన ప్రస్తుత తరుణంలో.. భారత్ తో సరిహద్దును పంచుకునే టిబెట్ లో చైనా అసాధారణ చర్యలకు దిగింది.

చైనా పై మోదీ సర్కార్ కీలక నిర్ణయం? - లదాక్‌ నుంచి కదలని డ్రాగన్ ఆర్మీ - ఢిల్లీలో టాప్ లీడర్ల భేటీచైనా పై మోదీ సర్కార్ కీలక నిర్ణయం? - లదాక్‌ నుంచి కదలని డ్రాగన్ ఆర్మీ - ఢిల్లీలో టాప్ లీడర్ల భేటీ

విదేశీ మంత్రి పర్యటన..

విదేశీ మంత్రి పర్యటన..

1959లోనే టిబెట్ ను ఆక్రమించిన చైనా అక్కడ ప్రాదేశిక ప్రభుత్వం(రీజనల్ గవర్నమెంట్)ను ఏర్పాటు చేసి పరోక్షంగా పరిపాలన కొనసాగిస్తున్నది. భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) సైతం టిబెట్ అటానమస్ రీజన్ లోనే ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నవేళ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గత వీకెండ్ లో టిబెట్ లో పర్యటించడం చర్చనీయాంశమైంది. భారత్-చైనా, టిబెట్-చైనా బంధాల పరంగా ఇది అసాధారణ చర్యేనని అనలిస్టులు చెబుతున్నారు.

రీసెర్చ్ లో భాగంగా..

రీసెర్చ్ లో భాగంగా..

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. అధికార కమ్యూనిస్టు పార్టీలోనూ కీలక వ్యక్తి, ట్రబుల్ షూటర్ కూడా. ఎల్ఏసీలో ఉద్రిక్తతల నివారణకు మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం వాంగ్ యీతోనే చర్చలు జరపడం తెలిసిందే. 14 దేశాలతో సరిహద్దులు పంచుకునే చైనాకు ఏమూల ఏ సమస్య వచ్చినా వాంగ్ యీ అక్కడ వాలిపోతారు. ‘రీసెర్చ్ టూర్' పేరుతో ఆయా ప్రాంతాల్లో ఆయన జరిపే పర్యటనలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. శుక్రవారం జరిపిన టిబెట్ టూర్ పైనా అదే స్థాయిలో చర్చ జరిగింది. దశాబ్దాల తర్వాత ఓ చైనా విదేశాంగ మంత్రి.. భారత్ సరిహద్దులోని టిబెట్ మారుమూల పల్లెల్ని సందర్శించడం ఇదే తొలిసారి.

అడ్డొస్తే రామ్ పోతినేని‌పై చర్యలు - విజయవాడ ఏసీపీ వార్నింగ్ - అంతలోనే హీరో మరో ట్విస్ట్అడ్డొస్తే రామ్ పోతినేని‌పై చర్యలు - విజయవాడ ఏసీపీ వార్నింగ్ - అంతలోనే హీరో మరో ట్విస్ట్

టిబెటన్ల మనసు గెలుచుకున్నాం..

టిబెటన్ల మనసు గెలుచుకున్నాం..

తన టిబెట్ పర్యటనలో భాగంగా వాంగ్ యీ పలు గ్రామాలను సందర్శించారు. టిబెట్ రీజనల్ గవర్నమెంట్ అధినేత క్విజాలా, టిబెట్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ వూ యింగ్జీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టిబెట్ సర్వతోముఖాభివృద్ధికి చైనా తోడ్పాటు అందిస్తుందని, ఇకపై టిబెట్ అంతర్జాతీయ సంబంధాల్లోనూ మార్పులు రాబోతున్నాయని, విదేశాలతో వ్యాపార, వాణిజ్య ఒప్పందాలకు అది రెడీగా ఉందని వాంగ్ తెలిపారు. టిబెట్ ను అన్ని రంగాల్లో ముందుంచడంతోపాటు గ్రామాలను అందంగా తీర్చిదిద్దడం ద్వారా టిబెటన్ల మనసులు గెలుచుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను భారత్ సహా ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇదిలా ఉంటే..

చరిత్రలో తొలిసారి చైనాపై ఫైర్..

చరిత్రలో తొలిసారి చైనాపై ఫైర్..

దక్షిణాసియా రాజకీయాల్లో మార్పునకు సంకేతంగా, చరిత్రలో తొలిసారి మలేసియా తన అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనాపై నిప్పులు చెరిగింది. దక్షిణ చైనా సముద్రంలో హక్కులు ఉన్నాయంటూ చైనా చేస్తున్న వాదనను మలేసియా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. పార్లమెంట్ సాక్షిగా మలేసియా విదేశాంగ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ చైనా తీరును వ్యతిరేకించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం సౌత్ చైనా సముద్రంలో చైనా హక్కులకు ఆదారాలు లేవన్నారు. మలేసియా ఎకనామిక్ జోన్లలోకి చైనా నౌకలు తరచూ అక్రమంగా ప్రవేశిస్తుండటం, పలు మార్లు హెచ్చరించినా.. సముద్రంపై హక్కులు తమవేనంటూ చైనా అడ్డంగా వాదిస్తున్న నేపథ్యంలో మలేసియా తొలిసారి చైనాపై తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించింది.

English summary
China's Foreign Minister Wang Yi made a rare visit to Tibet and the border areas last week and emphasised that the security and stability of the region is important. Malaysia has rejected Beijing's expansive maritime claims in the South China Sea, a region where Beijing's territorial claims have aggravated tensions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X