వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మా గర్విష్టి, పాక్ దుష్ట దేశమా? ఇండియా ఏమైనా ఐటీ సూపర్ పవరా?: చైనా అక్కసు

భారత్‌పై తన అక్కసును చైనా మీడియా మరోసారి వెళ్లగక్కింది. పాక్‌ ఉగ్రవాదులను ఎగుమతి చేస్తున్న దేశంగా అభివర్ణించడం రాజకీయంగా అసంబద్ధమైన చర్యగా పేర్కొంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బీజింగ్‌: భారత్‌పై తన అక్కసును చైనా మీడియా మరోసారి వెళ్లగక్కింది. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ తీరును ఐరాస వేదికగా భారత్‌ ఎండగట్టిన సంగతి తెలిసిందే.

పాక్‌ ఉగ్రవాదులను ఎగుమతి చేస్తున్న దేశంగా అభివర్ణించడం రాజకీయంగా అసంబద్ధమైన చర్యగా పేర్కొంది. చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తన సంపాదకీయంలో ఈ మేరకు పేర్కొంది.

సుష్మా స్వరాజ్ గర్విష్టి...

సుష్మా స్వరాజ్ గర్విష్టి...

ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం ఇస్తోందంటూ భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడంపై చైనా పత్రిక విమర్శలు గుప్పించింది. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను గర్విష్టిగా అభివర్ణించింది.

తీవ్రవాదం అణిచివేతలో పాక్...

తీవ్రవాదం అణిచివేతలో పాక్...

‘పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా భారత పాలకులు పేర్కొనడం రాజకీయంగా వారి దుర్భల మనస్తత్వానికి, అసంబద్ధతకు నిదర్శనం. టెర్రరిజాన్ని అంతమొందించేందుకు పాక్‌ తన సర్వశక్తులు ఒడ్డుతోంది. వారి చారిత్రక వివాదాలతో టెర్రరిజాన్ని కలగాపులగం చేయొద్దు..' అంటూ గ్లోబల్ టైమ్స్ రాసుకొచ్చింది.

పాకిస్తాన్ కి లాభమేముంది?

పాకిస్తాన్ కి లాభమేముంది?

‘పాకిస్తాన్‌లో ఉగ్రవాదం ఉన్న మాట వాస్త‌వ‌మే. అదేమైనా వారి జాతీయ విధానామా? ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం ద్వారా పాక్ డబ్బు.. గౌరవం.. పొందుతోందా? ఇస్లామాబాద్‌ ఒక్కటే ఉగ్రవాదులకు స్థావరం కాదనే విషయాన్ని భారత్‌తో సహా అమెరికా మిగిలిన దేశాలు గుర్తించాలని చెప్పుకొచ్చింది. పాకిస్థాన్‌పై దుర‌భిమానం క‌లిగి ఉండ‌టం ప్ర‌పంచ‌శ‌క్తిగా ఎద‌గాల‌నుకొంటున్న భారత్‌కు స‌రిపోద‌ని వ్యాఖ్యానించింది.

ఇండియా ఐటీ సూపర్ పవరా?

ఇండియా ఐటీ సూపర్ పవరా?

పాకిస్తాన్ ను దుష్ట దేశంగా అభివర్ణించే భారత్ ఏమైనా సుశిక్షతులైన ఇంజినీర్లు, డాక్టర్లను అందిస్తున్న నిజమైన ఐటీ సూపర్‌ పవరా?' అంటూ చైనా అధికార పత్రిక ప్రశ్నించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏ విధంగానైతే ‘అమెరికా ఫస్ట్‌' అనే నినాదాన్ని ఇచ్చారో.. ‘ఇండియా ఫస్ట్‌' అనే నినాదాన్ని ఇవ్వడం ద్వారా భారతీయుల్లో జాతీయవాదాన్ని రగలించాలంది.

పాక్ ను గౌరవించండి.. మాతో స్నేహంగా ఉండండి...

పాక్ ను గౌరవించండి.. మాతో స్నేహంగా ఉండండి...

‘కొంత కాలంగా భారత ఆర్థిక వ్యవస్థ, విదేశాలతో సత్సంబంధాలు స్థిరంగా, సానుకూలంగా ఉన్నాయి. అయితే తన దురంహకారంతో పాకిస్తాన్‌ను చిన్న చూపుచూస్తోంది. చైనాను అహంకారిగా భావిస్తోంది. అమెరికా, యూరప్‌లపై ప్రేమను కనబరుస్తూ పొరుగు దేశాలను చూసి భయపడుతోంది. ఇక మీ తెలివితేటలు చాలు.. చైనాతో స్నేహంగా ఉంటూ, పాకిస్తాన్‌ను గౌరవించండి. వివాదాలను పక్కకు పెట్టి, దౌత్యపరంగా సరిహద్దుల వద్ద సుహృద్భావంతో వ్యవహరించాలి. భారత్‌ను అడ్డుకోవాలనే కాంక్ష చైనాకు లేదు. నిజాయతీగా చెప్పాలంటే అది చైనాకు కూడా మంచిదికాదు.' అంటూ గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పేర్కొంది.

English summary
A Chinese daily has slammed External Affairs Minister Sushma Swaraj for her strong criticism of Pakistan for harbouring terrorists, saying it is "politically imbecilic and unsophisticated" to think that Islamabad exports terrorism. The editorial, titled India’s bigotry no match for its ambition, in state-run Global Times defending Pakistan against its failure to flush out terrorists is not surprising as China has always lavished praise on its "all-weather ally" for being at the "forefront" of tackling terrorism. The newspaper, run by the Communist Party, said Sushma Swaraj's speech at the UN reflected India's arrogance and "bigotry" towards Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X