వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఎఫెక్టా?: అమెరికాకు గట్టి షాకిచ్చిన చైనా

అమెరికాకు చైనా పెద్ద షాకిచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో అమెరికాకు చెందిన నేవీ అండర్ వాటర్ డ్రోన్‌ను చైనా యుద్ధ నౌక సీజ్ చేసింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/బీజింగ్: అమెరికాకు చైనా పెద్ద షాకిచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో అమెరికాకు చెందిన నేవీ అండర్ వాటర్ డ్రోన్‌ను చైనా యుద్ధ నౌక సీజ్ చేసింది. తైవాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యత్నిస్తున్న తరుణంలో చైనా ఈ షాకిచ్చింది.

China's Navy seizes American underwater drone in South China Sea.

మరోవైపు, చైనా చర్య పైన అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ డ్రోన్ పైన చెయ్యి వేసే హక్కు చైనాకు లేదని చెప్పింది. దక్షిణ చైనా సముద్రంపై హక్కులన్నీ తనవేనని చైనా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా నేవీ డ్రోన్ సీజ్ చేయడం గమనార్హం.

అమెరికాకు చెందిన రక్షణ వాహనాన్ని చైనా బంధించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అమెరికా నౌకాదళానికి చెందిన సముద్ర శాస్త్ర పరిశోధక నౌక కొద్ది రోజులుగా దక్షిణ చైనా సముద్రంలో పరిశోధనలు నిర్వహిస్తోందని, ఆ నౌక నుంచి సముద్ర గర్భంలోకి పంపిన అండర్ వాటర్ డ్రోన్ ఒకదానిని డిసెంబర్ 15న చైనా నావికాదళం స్వాధీనం చేసుకున్నదని అమెరికా అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు.

English summary
China's Navy seizes American underwater drone in South China Sea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X