వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరిక్షంలో చైనాకు చిన్న షాక్ - ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ ప్రయోగం విఫలం

|
Google Oneindia TeluguNews

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్, అమెరికాలకు దీటుగా ప్రయత్నాలు చేస్తోన్న చైనాకు చిన్న షాక్ తగిలింది. డ్రాగన్ దేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శాటిలైన్ ప్రయోగం విఫలమైంది. చైనా గోబీ ఎడారిలోని ప్రఖ్యాత జిక్వాన్‌ శాటిలైట్ సెంటర్ నుంచి శనివారం(స్థానిక కాలమానం ప్రకారం) మధ్యాహ్నం చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం ఫెయిలైన విషయాన్ని అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ స్వయంగా వెల్లడించడం గమనార్హం.

Recommended Video

China's Satellite Fails To Reach Orbit | Oneindia Telugu

చైనా అంత‌రిక్ష పరిశోధ‌న సంస్థ ఆధ్వర్యంలో శనివారం 'జిలిన్‌-1 గావోఫెన్ 02సీ' ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. అంతెత్తు నుంచి కూడా భూమ్మీదున్న వాటిని చూపగలిగే సామర్థ్యమున్న ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం కావడంతో ఈ ప్రయోగాన్ని చైనా కీలకంగా భావించింది.

చైనాతో టెన్షన్:మోదీ సర్కార్ అనూహ్యం - సరిహద్దుపై పార్లమెంట్‌లో చర్చకు నో - అఖిలపక్ష భేటీ కూడా లేదుచైనాతో టెన్షన్:మోదీ సర్కార్ అనూహ్యం - సరిహద్దుపై పార్లమెంట్‌లో చర్చకు నో - అఖిలపక్ష భేటీ కూడా లేదు

Chinas optical remote-sensing satellite fails to reach orbit

క్వాయ్‌జావ్-1ఏ రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టగా.. రాకెట్ నిర్ణీత క‌క్ష్య‌ను చేరుకోవ‌డంలో మాత్రం విఫ‌ల‌మైంది. కాగా, రాకెట్ నింగిలోకి ఎగుర‌గానే దానిలోని సాంకేతిక లోపాల‌ను గుర్తించామ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. ప్ర‌యోగం విఫ‌ల‌మ‌వ‌డానికిగ‌ల కార‌ణాలపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని చెప్పారు.

ఇదే జిక్వాన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి గతవారం చైనా చేసిన ఓ వినూత్న ప్రయోగం మాత్రం సక్సెస్ అయింది. గత శుక్రవారం లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌ ద్వారా ప్రయోగించిన పునర్వినియోగ అంతరిక్షనౌక.. రెండ్రోజులపాటు నిర్దేశిత కక్ష్యలో పరిభ్రమించిన అనంతరం విజయవంతంగా భూమిపైకి తిరిగొచ్చింది. పునర్వినియోగ వ్యోమ నౌక సాంకేతిక పరిశోధనలో దీన్నొక కీలక ముందడుగుగా చైనా అధికారిక మీడియా వెల్లడించింది.

English summary
China's optical remote-sensing satellite Jilin-1 Gaofen 02C failed to enter the pre-set orbit on Saturday, official media reported. The satellite was launched aboard the Kuaizhou-1A carrier rocket from Jiuquan Satellite Launch Center at 1:02 pm (local time). The launch centre said the mission failed because of abnormal performance, state-run Global Times reported. Specific reasons for the failure are under investigation, it said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X