వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘వీర్యం దానం చేయండి..! ఐఫోన్ తీసుకెళ్లండి’

|
Google Oneindia TeluguNews

షాంఘై: యాపిల్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఐఫోన్‌ను దక్కించుకునేందకు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు పోటీ పడుతున్నారు. కాగా, చైనాలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. దీన్ని ఆసరా చేసుకుని వీర్యం సేకరించే బ్యాంకులు సరికొత్త ఆలోచనను అమలు చేస్తున్నాయి.

'వీర్యం దానం చేయండి.. ఐఫోన్ 6ను తీసుకెళ్లండి' అంటూ టెక్నాలజీ ప్రియులకు గొప్ప ఆఫర్ ఇచ్చేశాయి. దీంతో ఆ బ్యాంకుల ముందు ఐఫోన్ పొందాలనుకుంటున్న వారు భారీ ఎత్తున బారులు తీరుతున్నారు.

ఇటీవల ఐఫోన్ 6ఎస్ కోసం ఇద్దరు చైనీయులు ఏకంగా తమ కిడ్నీలను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. బేరం బెడిసి కొట్టడంతో వారు వెనక్కు తగ్గారు. కాగా, షాంఘైలోని రెండు స్పెర్మ్ బ్యాంకులు ఈ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాయి.

China’s sperm banks entice customers with iPhone 6S

'వీర్యం దానం చేయండి.. ఐఫోన్ పట్టుకెళ్లండి' అంటూ ఈ బ్యాంకులు పిలుపునివ్వడంతో ఐఫోన్ ప్రియుల సందడి నెలకొంది. ఆ బ్యాంకుల చుట్టూ వారు తిరుగుతున్నారు. అయితే వీర్యం దానం చేయడానికి కొన్ని అర్హతలు కూడా నిర్దేశించాయి స్పెర్మ్ బ్యాంకులు.

చైనా గుర్తింపు కార్డు, కాలేజీ డిగ్రీతో పాటు తప్పనిసరిగా 165 సెంటీమీటర్ల ఎత్తు కలిగివుండాలి. అంతేగాక, ఎటువంటి జన్యుపరమైన వ్యాధులు ఉండరాదు. 17 మిల్లీలీటర్ల వీర్యం దానం చేస్తే సుమారు రూ. 60 వేలు ఇస్తామని స్పెర్మ్ బ్యాంకులు ప్రకటించాయి.

ఇక్కడ మరో ఆఫర్ కూడా ఉంది. ఒక్కరు ఎన్నిసార్లైనా వీర్యాన్ని దానం చేయొచ్చు. అయితే ఒకసారి దానం చేసిన తర్వాత 48 రోజుల గ్యాప్ తీసుకోవాలని నిబంధన కూడా పెట్టింది. ఈ మొత్తం సమాచారాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టింది. కాగా, ఇప్పటికే ఈ సమాచారాన్ని 4లక్షల మంది వీక్షించారు.

English summary
The iPhone 6S is so anxiously awaited in China that sperm banks are using it to lure donors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X