• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యూఎస్ జోక్యాన్ని ఏమాత్రం అంగీకరించం.. అమెరికాపై చైనా వీసా ఆంక్షలు : యూఎస్, చైనా మధ్య ఘర్షణ

|

చైనాపై అగ్రరాజ్యం అమెరికా అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. సరిహద్దు వివాదాలు కేంద్రంగా చేసుకుని భారత్ పై చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకున్న అమెరికా చైనా అధికారులకు నో ఎంట్రీ బోర్డు పెట్టిన విషయం తెలిసిందే. టిబెట్ లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆ దేశానికి చెందిన అధికారులపై అమెరికా వీసా ఆంక్షలు విధించింది. అయితే అమెరికా పెట్టిన వీసా ఆంక్షలపై చైనా మండిపడుతోంది.

  US Announces Visa Restrictions On Chinese Officials | టిబెట్ యాక్ట్ ప్రయోగం || Oneindia Telugu

  చైనాతో యుద్ధం వస్తే ఇండియాకు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా : వైట్ హౌస్ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు

  అమెరికా పౌరులపై వీసా ఆంక్షలు పెడతామన్న చైనా

  అమెరికా పౌరులపై వీసా ఆంక్షలు పెడతామన్న చైనా

  తాము కూడా అమెరికా పౌరులపై వీసా ఆంక్షలు పెడతామని స్పష్టం చేస్తోంది .అమెరికా చర్యను ఓవరాక్షన్ గా పేర్కొన్న చైనా టిబెట్ అటానమస్ రీజియన్ విషయంలో ఇతరుల జోక్యం ఎంతమాత్రం అంగీకరించబోమని బీజింగ్ నుండి అమెరికాకు తేల్చి చెప్పింది. టిబెట్ కు సంబంధించిన సమస్యలను కారణంగా చూపి చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాను కోరింది చైనా .ఇటువంటి చర్యలు అమెరికా చైనా దేశాల మధ్య సంబంధాలను మరింత నష్టం కలిగిస్తాయని పేర్కొంది.

  చైనా అంతర్గత విషయాలలో అమెరికా జోక్యం అంగీకరించమని స్పష్టం

  చైనా అంతర్గత విషయాలలో అమెరికా జోక్యం అంగీకరించమని స్పష్టం

  చైనా అధికారులపై అమెరికా వీసా ఆంక్షల నేపథ్యంలో స్పందించిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అమెరికా తప్పుడు మార్గంలో ముందుకు వెళ్లాలని చూడటం మంచిది కాదని పేర్కొన్నారు. అనవసరంగా చైనా అంతర్గత విషయాలలో అమెరికా జోక్యం చేసుకుంటుందని, అలా జోక్యం చేసుకోరాదని కోరారు. టిబెట్లో తమ చర్యలను చైనా సమర్థించుకుంటోంది. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతుంది.టిబెట్ ఎప్పుడూ తెరిచే ఉంటుందని విదేశీయులు అక్కడ పర్యటించడానికి ఎలాంటి ఆంక్షలు లేవని చెబుతోంది. అయితే భౌగోళికంగా ప్రత్యేకమైనదని ,అక్కడి పరిస్థితుల దృష్ట్యా చైనా ప్రభుత్వం విదేశీయుల పర్యటనల విషయంలో కొన్ని నిబంధనలు పాటిస్తుందని చెప్పడం గమనార్హం.

  టిబెట్ విషయంలో అమెరికా కీలక నిర్ణయం

  టిబెట్ విషయంలో అమెరికా కీలక నిర్ణయం

  టిబెట్లో పర్యటించకుండా అమెరికా పౌరులతో సహా ఇతర దేశాలకు చెందిన పౌరులను, దౌత్యవేత్తలను, జర్నలిస్టులను కూడా ఆంక్షలు విధించి అడ్డుకుంటోంది చైనా. ఈ క్రమంలో పరిమిత సంఖ్యలో మాత్రమే పర్యాటకుల అనుమతిస్తుంది చైనా. ఒకవేళ ఎవరైనా అతిథులను అనుమతిస్తే వాళ్లతో పాటు వారి సిబ్బంది ఉండేలాగా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అమెరికా చైనా విషయంలో అధికారుల వీసాలపై ఆంక్షలు విధించింది .

  చైనాపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం

  చైనాపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం

  ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా చైనా తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. కరోనా వైరస్ డ్రాగన్ కంట్రీ వల్లే వ్యాప్తి చెందిందని మండిపడుతుంది.అమెరికా చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి తాజా పరిణామాలతో కనిపిస్తుంది. మరోపక్క చైనాతో ఒకవేళ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే భారత్ కు అండగా అమెరికన్ సైనిక బలగాలు ఉంటాయి అన్న వైట్ హౌస్ వర్గాల ప్రకటన సైతం చైనాకు ఆగ్రహం తెప్పిస్తోంది.

   తాజా పరిణామాలతో అమెరికా, చైనా మధ్య ఘర్షణ వాతావరణం

  తాజా పరిణామాలతో అమెరికా, చైనా మధ్య ఘర్షణ వాతావరణం

  దీంతో పాటు తాజాగా అమెరికా కూడా సంబంధించిన యాప్స్ బ్యాన్ చేయడం,వీసాలపై ఆంక్షలు పెట్టడం వంటి నిర్ణయాలు చైనా అమెరికా మధ్య సంబంధాలను మరింత దిగజారుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా నిర్ణయాలకు సమాధానంగా చైనా చేసిన వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మరింత ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి. ఇండియా చైనాల మధ్య ఘర్షణ వాతావరణం కన్నా,మారుతున్న తాజా పరిణామాలతో అమెరికా చైనాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుందా అన్న అనుమానం కలుగుతుంది.

  English summary
  The US has imposed visa restrictions on china officials due to Tibet alleging human rights violations. China, fires oer the decision by US visa restrictions. They have also made it clear that they will be granted visa restrictions on US citizens.They never entertain anybody intervene in tibet atanomous region . this is turned as a row between China and US on tibet .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more