వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లదాక్‌ను యూటీగా గుర్తించబోం - చైనా రెచ్చగొట్టే ప్రకటన - ఇండియాదే ఆక్రమణంటూ..

|
Google Oneindia TeluguNews

సరిహద్దు వెంబడి ఐదు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతల్ని మరింత పెంచేలా చైనా రెచ్చగొట్టే ప్రకటనలకు దిగుతున్నది. భారత్ అంగీకరించని 1959నాటి ఎల్ఏసీ ఒప్పందం ప్రకారం.. మన భూభాగంలోని ప్రాంతాలను తనవిచెప్పుకుంటోన్న డ్రాగన్.. తాజాగా లదాక్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని తాము గుర్తించబోమంటూ ప్రకటన చేసింది.

 చైనా కిరికిరి: తిప్పికొట్టిన భారత్ - ఎల్ఏసీపై డ్రాగన్ వివ‌ర‌ణ‌ను తోసిపుచ్చిన విదేశాంగ శాఖ చైనా కిరికిరి: తిప్పికొట్టిన భారత్ - ఎల్ఏసీపై డ్రాగన్ వివ‌ర‌ణ‌ను తోసిపుచ్చిన విదేశాంగ శాఖ

భారత ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన లదాక్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని గుర్తించబోమని, సరిహద్దులోని పశ్చిమ చైనా భూభాగంపై భారత్ పరిపాలనా అధికార పరిధిలోకి చేరడాన్ని తాము ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంలో తమ వైఖరి మారబోదని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్‌ వ్యాఖ్యానించారు.

China says it does not recognise UT of Ladakh; India hits back

బీజింగ్ లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భారత్ ఆక్రమణలకు పాల్పడుతున్నదని, సైనిక నిర్మాణాలు చేపట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చైనా చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్‌ అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ నుంచి లదాక్ లోని లేహ్ వరకు భారత్ నిర్మించిన సొరంగ మార్గం(అటల్ టన్నెల్)పై ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

 కువైట్ రాజు సబ అహ్మద్ కన్నుమూత - కారణాలపై గోప్యత - రాజ్యానికి వారసుడు నవాఫ్ అహ్మద్ కువైట్ రాజు సబ అహ్మద్ కన్నుమూత - కారణాలపై గోప్యత - రాజ్యానికి వారసుడు నవాఫ్ అహ్మద్

సరిహద్దు ఒప్పందాలకు విఘాతం కలిగేలా అక్కడి పరిస్థితులను క్లిష్టతరం చేసేలా భారత్ కార్యకలాపాలు చేస్తున్నదని, ఇకనైనా భారత్ కట్టుబాట్లను గౌరవించాలని వెన్బిన్ అన్నారు. భారత్ ఆరోపిస్తున్నట్లుగా ఎల్ఏసీ వెంబడి తాము అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని, తమ భూభాగంలోనే మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎల్ఏసీ సమీపంలో చైనా కొత్తగా సైనిక శిబిరాలను నిర్మించినట్లు వస్తున్న వార్తలను వాంగ్ ఖండించారు. కాగా, చైనా వాదనను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. సార్వభౌమత్వం విషయంలో రాజీపడబోమని, ఎల్ఏసీపై చైనా వాదనను తిరస్కరిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.

English summary
China once again provoked India amid the ongoing border dispute, saying that it does not recognise the union territory of Ladakh. Chinese Foreign Ministry spokesperson Wang Wenbin claimed that India had “illegally” established the UT of Ladakh and opposed infrastructure development on border areas. India hit back and told Beijing to refrain from advancing “an untenable unilateral interpretation of the Line of Actual Control (LAC)”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X